కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు
ములుగు జిల్లా, ఆగస్టు :27 : ఏటూరునాగారం కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశం ఎండిగపూర్ పాషా అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో మొదట ఇటీవల మరణించిన సారంపల్లి మల్లారెడ్డి రైతు సంఘం ఆలిండియా ఉపాధ్యక్షుడు కి మొదట సమావేశం సంతాపం తెలిపింది.అనంతరం జరిగిన సభలో పోతినేని సుదర్శన్ రావు గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుండి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చినాడు ఈ చట్టానికి వ్యతిరేకంగా రైతులు 385 రోజులు పోరాటం చేసి నల్ల చట్టాలను వెనుక గొట్టడం జరిగింది .అయినా దొడ్డి దారిన ప్రైవేటు విత్తన చట్టం తెచ్చి విత్తనాలపై రైతులకు కాకుండా కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా చట్టాలు మార్చారని అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం నూతన వాణిజ్య విధానం పేరుతో అమెరికా కెనడా న్యూజిలాండ్ దేశంలోకి విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు బార్ల తలుపులు తెరిచి 52 శాతం వ్యవసాయ రంగం పై ఆధారపడ్డ మన దేశ వ్యవసాయ రంగాన్ని కూలీలను బలి పశువులు చేయడం కోసం చట్టాలు తెచ్చారని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రైతు సంఘం రాష్ట్రంలో అనేక రైతు వ్యతిరేక విధానాల కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో 36వ అఖిలభారత మహాసభలు నల్లగొండ జిల్లాలో నవంబర్ 15 నుండి 18 వరకు జరగనున్నాయని ఈ మహాసభల జయప్రదానికి రైతులందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు సూడి కృష్ణారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ వెంకటేశ్వర్లు తుమ్మల వెంకట్ రెడ్డి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి దావూద్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తీగల ఆదిరెడ్డి.చిట్టెం ఆదినారాయణ వడకాపురం సారయ్య ఎండి యాకూబ్ బండారి నరసింహులు ఎల్పి ముత్యాలు మంచాల రామారావు గుండు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.