నoదిన్నే చెక్ పోస్టు వద్ద  వాహన తనిఖీల్లో  ఏలాంటి రశీదులు లేని 2,21,000/- రూపాయలు  సీజ్

Apr 8, 2024 - 19:51
 0  7
నoదిన్నే చెక్ పోస్టు వద్ద  వాహన తనిఖీల్లో  ఏలాంటి రశీదులు లేని 2,21,000/- రూపాయలు  సీజ్

జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2020 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల.లోక్ సభ ఎన్నికల కోడ్ లో బాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల పరిధిలో, సరి హద్దు చెక్ పోస్టు లలో పోలీస్ అధికారులు  చేపడుతున్న   తనిఖీలలో భాగంగా KT దొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ని నందిన్నే చెక్ పోస్టు దగ్గర  వాహన తనిఖీల్లో ఏలాంటి రశీదు లేని 2,21000/- రూపాయలను సీజ్ చేసి  జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటి కి అప్పగించినట్లు  జిల్లా ఎస్పీ  రితిరాజ్,IPS   తెలిపారు.  కర్ణాటక సరిహద్దు నందిన్నే చెక్ పోస్టు దగ్గర వాహనాలను తనిఖీ చేయగ ఒక వాహనం లో ఏలాంటి రశీదు లేని 1,48,000/-  రూపాయలు, మరోక వాహనం లో 73,000/- రూపాయలను (మొత్తం 2,21,000/- రూపాయలు)గుర్తించి సీజ్ చేసి జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీకి పోలీస్ అధికారులు అప్పగించినట్లు ఎస్పీ  తెలిపారు.  ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో ఎవరైన 50 వేల రూపాయల కొద్దీ ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే  తగిన రశీదులు ,పత్రాలు  వాటి వివరాలు వెంట తీసుకెళ్ళాలని జిల్లా ఎస్పీ  ప్రజలకు సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333