కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి నివాళులర్పించిన ఉండవెల్లి మండల సమితి
అల్లంపూర్ 23 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- కంచిపాడు గ్రామంలో సురవరం సుధాకర్ రెడ్డి నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి ఉద్యమ స్ఫూర్తితో అల్లంపూర్ నియోజకవర్గం రైతులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన అంశాలైన నీరు నిధులు నియామకాలు అందులో మన నియోజకవర్గానికి రెండు వైపులా జలాశయాలు నిండుగా ఉన్న చుక్కనీరు కూడా ఉపయోగించుకోలేని స్థితిలో మనం ఉన్నాం కాబట్టి రైతులు ఉద్యమ బాటలో నడవాల్సిన అవసరం ఉన్నది అని కోరారు కామ్రేడ్స్ సుధాకర్ రెడ్డి కంచుపాడు గ్రామంలో కుట్టు మిషను నేర్పించుటకు సహకరించి సుమారుగా 5000 మంది కుట్టుమిషన్ నేర్చుకుని సొంత ఉపాధి చేకూర్చుకున్నారు అలాగే కంప్యూటర్ కోచింగ్ తీసుకుని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే మరెన్నో కార్యక్రమాలు చేశారు.
మండల సహాయ కార్యదర్శి రవి మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి ఆదర్శవంతుడని ఆయన మార్గంలో అందరూ నడవాలని కోరారు. రైతు సంఘం చైర్మన్ వడ్డేమాన్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి మన ఊర్లో పుట్టి పెరిగిన గొప్ప రాజకీయ నాయకులుగా ఎదిగారని మనందరికీ ఆయన ఆదర్శమని పేద ప్రజల కోసం కృషి చేసిన నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామకృష్ణ యువజన సమైక్య మాజీ అధ్యక్షులు s వీరాంజనేయులు బాలకృష్ణారావు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు