కోషన్స్ కెమికల్ కంపెనీని ఈ ప్రాంతం నుంచి తరలించాలి

Aug 23, 2026 - 21:59
 0  0
కోషన్స్ కెమికల్ కంపెనీని ఈ ప్రాంతం నుంచి తరలించాలి

నాలుగు దశాబ్దాల కాలం  నాటి కంపెనీ పరిమితి పెంచడం ఏంటి?

కంపెనీ పరిసర ప్రాంత ప్రజలకు పిల్లని ఇవ్వడం లేదు!!

వంద కుటుంబాలు ఉంటే సగం మందికి పైగా రోగాల బారిన పడుతున్నారు

కాలుష్య ప్రభావిత ప్రాంతాలజేఏసీ డిమాండ్

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కోహెన్స్ కెమికల్ కంపెనీని తక్షణమే దూరప్రాంతాలకు తొలగించాలని కాలుష్య ప్రభావిత ప్రాంతాల జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్వీకే గ్రాండ్ హోటల్లో శివరాం నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోహన్ కంపెనీ నాలుగు దశాబ్దాల క్రితం జనవాసాలు లేని ప్రదేశంలో ఏర్పాటు చేశారు. పట్టణం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి ఇక్కడి ప్రాంతవాసులకు నేల, గాలి విషతుల్యం అవుతూ ప్రజల జీవితాలను సర్వనాశనం చేస్తుందని వారు అన్నారు. పక్కనున్న తండాలలో అనేక రకాల జబ్బులతో మనుషులు మరణిస్తున్నారని ఇదే విషయంపై కంపెనీ మూసివేయాలని అనేకసార్లు పోరాటం చేసిన కంపెనీ యాజమాన్యం కొంతమంది వ్యక్తులను ఆమ్యామ్యాలను ఆశ చూపుతూ ఉద్యమాన్ని నీరుగారుస్తూ వచ్చారని అన్నారు. కంపెనీ తీసేంతవరకు ఉద్యమం చేస్తామని అన్ని రకాలుగా లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ముందుకు వెళ్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, చిలుముల సునీల్ రెడ్డి, బూర వెంకటేశ్వర్లు, మద్దబోయిన శ్రీనివాస్, జాటోత్ నగేష్, ధరావత్ బిక్షం, రేఖ సతీష్ గౌడ్, జ్యోతి నాయక్, హాథిరామ్ నాయక్, కుంభం నాగరాజు, లింగా నాయక్, మకట్ లాల్, వాజిద్ మియా, సేవియా నాయక్, తారా సింగ్, సూరి, శివరాత్రి నాగరాజు ,రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333