కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి

Oct 31, 2025 - 19:17
 0  3
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి

 జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఐజ ఉక్కు మహిళగా పేరుగాంచిన మాజీ భారత ప్రధాని శ్రీ ఇందిరా గాంధీ  వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ SA సంపత్ కుమార్  ఆదేశానుసారం.. మండల పార్టీ అధ్యక్షులు జయన్న అధ్యక్షతన  ఐజ పట్టణం  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నాయకులందరూ ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలతో సత్కరించి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప ,వైస్ చైర్మన్ మచ్చర్ల కుమార్ లతోపాటు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సంకాపురం రాముడు, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కొంకల నాగరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎస్ మద్దిలేటి, సీనియర్ నాయకులు భూమి పురం నరసింహారెడ్డి, ఉప్పల తిప్పన్న , గాల్ రెడ్డి, తిమ్మారెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మన్న, మాజీ కౌన్సిలర్లు గిత్తల దేవరాజు, రాజు నారాయణ,జిల్లా అధికార ప్రతినిధి మైనర్ బాబు, దేవేంద్ర, రవీందర్ ,పాండురంగ,మహేష్ ,కృష్ణరెడ్డి ,ఈరన్న, ముక్కెరన్న, మాజీ సర్పంచులు , వార్డు నెంబర్లు,తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333