కస్తూర్బాగాంధీ విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రశంస పత్రాలు

Apr 23, 2026 - 19:33
 0  3
కస్తూర్బాగాంధీ విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రశంస పత్రాలు

అడ్డగూడూరు 23 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కాంచనపల్లి గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో టాపర్స్‌కు సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఎంపిసి,బైపిసి గ్రూప్‌ల విద్యార్థినిలను శాలువాతో సన్మానించారు.అనంతరం వారికి 5వేల రూపాయల ఒక్కొకరికి నగదు ఇచ్చిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ విధంగా విద్యార్థుల ప్రోత్సాహానికి మార్గం చేస్తూ..విద్యా రంగంలో పురోగమించడానికి సిఆర్ఎస్ కార్యక్రమాలను చేపట్టడం రాష్ట్రానికి ముఖ్యమైనది.విద్యార్థుల కష్ట శ్రమకు గుర్తింపు అందించడం ద్వారా,వారి భవిష్యత్తుపై అనుకూల ప్రభావం పడుతుంది.ఈ కార్యక్రమం విద్యార్థుల మధ్య స్పూర్తిని నింపడమే కాకుండా,ఇతర విద్యా సంస్థలపై కూడా మంచి ప్రేరణతో ముందుకు వెళ్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,సిబ్బంది,ఎంఈఓ సబిత,ఎంపీడీవో శంకరయ్య,పిఎసిఎస్ మాజీ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,వైస్ చైర్మన్ చెడి చంద్రయ్య, గ్రామ సర్పంచ్ చెడే అంబేద్కర్, వెల్దేవి గ్రామ సర్పంచ్ రాచకొండ రమేష్ గౌడ్,పార్టీ మండల నాయకులు,పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333