రేపాక గ్రామంలో బడిబాట కార్యక్రమం

Apr 23, 2026 - 19:34
 0  5
రేపాక గ్రామంలో బడిబాట కార్యక్రమం

 యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల : పరిధిలోని డి రేపాక గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్,పిఎస్ "స్కోప్" స్వచ్ఛంద సంస్థ సంయుక్తా ధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల పనితీరును తెలియజేయడం జరిగింది. అడ్డగూడూరు మండలం ఎంఈఓ ఎన్ సబితా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అలాగే..ప్రభుత్వ పాఠశాలలో అందించే నాణ్యమైన విద్యతోపాటు మధ్యాహ్న భోజనం,యూనిఫామ్, పుస్తకాలు,అల్పాహారం తదితర విషయాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది.స్కోప్ స్వచ్ఛంద సంస్థ మండల కోఆర్డినేటర్ కురిమేటి యాదయ్యమాట్లాడుతూ..బాల్యవివాహాలు నిర్మూలన డ్రాప్ అవుట్ ,బాల కార్మిక వ్యవస్థ తదితర అంశాలపై ఉపాధి హామీ కూలీలకు 1098టోల్ ఫ్రీ నెంబర్ గురించి అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిఎస్ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎం  కె నర్సయ్య,వెంకట్ రెడ్డి,వకులా దేవి,వెంకన్న, చంద్రశేఖర్ రెడ్డి, నిరంజన్,శ్రీనివాస్,వంశీ ,ఉపాధి హామీ కూలీలు,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333