ఓటరు జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. అనుసంధానం కాని, వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు సంబంధించిన ప్రకటనలను సంబంధిత ఓటర్లకు తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు. ప్రకటనలు అందించిన అనంతరం విచారణకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిర్ణీత గడువులోగా విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన ధ్రువపత్రాలను స్వీకరించి రికార్డుల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత బూత్ స్థాయి అధికారులు మండల ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ నందిని, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.