ప్రతిభా పురస్కారాన్ని అందుకున్న కళాకారుడు పిచ్చయ్య
సూర్యాపేట:- తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో త్యాగరాయ గాన సభ నందు శివాని ఆర్ట్స్ అసోసియేషన్ మరియు శ్రీ వైయస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్టు సంయుక్త నిర్వహణలో జరిగిన మున్నంగి భాస్కర రావు 83వ జయంతి ని పురస్కరించుకుని మున్నంగి భాస్కర రావు పురస్కార మహోత్సవ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కళాకారుడు డాక్టర్ డాక్టర్ గుంటి పిచ్చయ్య ప్రదర్శన దుర్యోధనుడు ఏకపత్రాభినయం, నాగరాణి, డాక్టర్ గుంటి పిచ్చయ్య ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అలరించినది. డాక్టర్ గుంటి పిచ్చయ్య గత మూడు దశాబ్దాలుగా సామాజిక సాంస్కృతిక సాహిత్య కళారంగానికి విశిష్ట సేవలు అందించిన సందర్భంగా ఆణిముత్యం ప్రతిభ పురస్కారాన్ని సినిమా డైరెక్టర్ ఏ రాజశేఖర్ చేతుల మీదుగా డాక్టర్ గుంటి పిచ్చయ్యకు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గుంటి పిచ్చయ్య ఆణిముత్యం పురస్కారం స్వీకరించిన సందర్భంగా జాతీయ రంగస్థల నటులు పీవీ రంగయ్య, సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి దైద వెంకన్న అనిత, సీనియర్ జర్నలిస్టు, గోల్డ్ మెడలిస్టు గవర్నర్ అవార్డు గ్రహీత డాక్టర్ బంటు కృష్ణ ,కవి రచయిత సీనియర్ జర్నలిస్టు కందుకూరి యాదగిరి, హోప్ సంస్థ, సింధు ఆర్ట్స్ అకాడమీ రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ నీరుడు విజయ్, హోప్ సంస్థ జాజిరెడ్డిగూడెం మండల కోఆర్డినేటర్ దడిపల్లి వెంకట్, కవి రచయిత సామాజిక కార్యకర్త హమీద్ ఖాన్, యశోద ఫౌండేషన్ చైర్మన్ నరాల రుక్కాలరావు గాయకులు వల్లంపట్ల అబ్రహం, దాచేపల్లి లక్ష్మి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.