అంగన్వాడీ లో తల్లిపాల వారోత్సవం.
జోగులాంబ గద్వాల 7 జులై ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల పరిధిలోని చాగాపురం గ్రామ పంచాయతీ అంగన్వాడీ టీచర్ల భాగ్యమ్మ చంద్రకళ ఉమా ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాల ను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా . ఏఎన్ఎం విద్యావతి సందర్భంగా మాట్లాడుతూ... వారు తల్లిపాలు బిడ్డకుపోషకఆహారంఇవ్వడమే కాకుండా పశువైసులోతీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా భద్రత నిస్తుందని మొదటి టీకాగా పనిచేస్తాయి. తల్లిపాలు కాన్పు తర్వాతే మొదటి రెండు మూడు రోజుల్లో వచ్చే ముర్రి పాలు చాలా ముఖ్యమైనవి ఇందులో ఉండే పోషకాలు బిడ్డ రోగ నిరోధకశక్తినిపెంపొందించడానికి దోహదపడతాయని అన్నారు. తల్లి పాలల్లో విటమిన్ ఏ అధిక శాతంలో ఉండడం వల్ల శిశువు కళ్లుప్రశాంతంగా ఉంటాయని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలని గర్భిణీ స్త్రీలకుబాలింతలకుసూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం విద్యావతి, లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు భాగ్యమ్మ చంద్రకళ ఉమా ఆశవర్కర్లు పద్మ ఈదమ్మ హేమలత రేణుక,గర్భిణీస్ర్తీలు తదితరులు పాల్గొన్నారు.