ఏ పదవి అప్పగించినా నిర్వర్తిస్తా.. డీకే అరుణ

Jun 5, 2024 - 17:22
 0  37
ఏ పదవి అప్పగించినా నిర్వర్తిస్తా.. డీకే అరుణ

జోగులాంబ గద్వాల 5 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-- గద్వాల. మహబూబ్నగర్. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని.. ఎన్నికలు ముగిసినాక రాజకీయాలు పక్కన బెట్టాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. బుధవారం ఆమె మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు పార్టీ ఏ పదవి అప్పగించినా నిర్వర్తిస్తా అని అన్నారు. మంత్రి పదవి కోసం తాను లాబీయింగ్ చేయబోను అని తేల్చి చెప్పారు. ఎన్నికలు అయిపోయాయి... రాజకీయాలు పక్కన పెట్టాలి. అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరస్పర సహకారం అవసరం. గ్రామీణ ప్రాంతాల వరకు.. ప్రతీ ఇంటికి బీజేపీ చేరిందని అన్నారు. తాము రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కోరడం లేదు.. హద్దులు దాటి రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై అబద్ధాలు ప్రచారం చేశారని గుర్తుచేశారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించారని మండిపడ్డారు.

 రేవంత్ రెడ్డి, డీకే అరుణ ఒకే ఫ్లైట్‌లో వెళ్ళినంత మాత్రాన కలిసి పోయినట్లు కాదని అన్నారు. పాలమూరు లిఫ్ట్ ప్రాజెక్టు DPR తయారు చేయాలని సీఎం రేవంత్‌ను కోరుతున్నట్లు తెలిపారు. వలసలు తగ్గాలంటే పాలమూరు లిఫ్ట్‌తోనే 7 అసెంబ్లీ స్థానాలకు నీళ్ళు ఇవ్వాలని అననారు. పాలమూరు - రంగారెడ్డిలో రంగారెడ్డి తీసి వేసి పాలమూరు లిఫ్ట్ కోసం కొత్త DPR తయారు చేయాలని డిమాండ్ చేశారు. డిండికి పాలమూరు నుంచి నీళ్లు తీసుకోవద్దని అన్నారు. 7వ తేదీన ఢిల్లీ వెళతాం.. 8న పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేక దృష్టి పెట్టి తానే అభ్యర్థిగా ప్రచారం చేసినా తనను ఓడించలేకపోయారని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ ఎన్నికల ఫలితాలు టీ20 మ్యాచ్‌లా సాగిందని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333