ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును ఖండిస్తూ రాస్తారోకో తీసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు

Mar 16, 2024 - 20:56
 0  2
ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును ఖండిస్తూ రాస్తారోకో తీసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు

మునగాల 17 మార్చి 2024 

తెలంగాణ వార్తా ప్రతినిధి :-

మునగాల; తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని కెసిఆర్ నీ ఎదుర్కోలేక రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా ప్రధాని మోడీ కేంద్ర సంస్థలను తన ఆధీనంలోనే ఉంచుకొని రాజకీయ ప్రత్యార్థులపై దర్యాప్ సంస్థలను అక్రమంగా ఉసిగొలిపి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసు పెట్టి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఈడీ సోదాల పేరుతో అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు.శనివారం మునగాల లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు,రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు, ఈ సందర్భంగా రాస్తారోకోను ఉద్దేశించి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ సీరియల్ తలపించేలా ఇన్నిరోజులు విచారణ పేరుతో అయోమయానికి గురిచేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఎదురుకోలేక మోడీ కాంగ్రెస్ కుమ్మకు రాజకీయాలు చేసి తెలంగాణను అన్యాయం చేయాలని సంకల్పంతో రాజకీయ చదరంగం లో భాగంగా అరెస్టు చేయటం అక్రమమని అన్నారు, ఈడి కవితను అరెస్టు చేయమని సుప్రీంకోర్టుకు అపిడవిట్ ఇచ్చి తీరా లోకసభ ఎన్నికలకు ముందు కేసిఆర్ ను బిఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీయాలని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మోడీ చీకటి ఒప్పందంలో భాగంగా అకారణంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం రాజకీయ కక్షల కోసమే, మోడీ ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడమేనని దుయ్యబట్టారు.ఇది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమేనన్నారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ముందుకుపోయిన రాష్ట్రాన్ని చెల్లా చెదురు చేసి తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ నేతలు పన్నిన రాజకీయ కుట్రలో భాగమేనన్నారు.రాజకీయ కుయుక్తులతో తెలంగాణ సాధకుడు కేసీఆర్ మనోధైర్యాన్ని ఎవరు కదిలించలేరని, ఇటువంటి ఎన్నో ఆటుపోట్లను చూసిన ఉక్కుగుండె కేసీఆర్ ది అన్నారు.ఇటువంటి చర్యలకు బెదిరేదిలేదనీ, ఎమ్మెల్సీ కవితకు యావత్ తెలంగాణ సమాజం అండగా నిలుస్తుందని స్పష్టం చేసారు.ఈ వ్యవహారం పై చట్టసభల్లో న్యాయస్థానాల్లో పోరాడుతామన్నారు.కవిత వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తొగర్ రమేష్ మునగాల సింగిల్ విండో చైర్మన్ కందిబండ సత్యనారాయణ, పార్టీ మండల కార్యదర్శి ఎలక వెంకటరెడ్డి,ఆకుపాముల తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ లు రామ్ రెడ్డి, టీ సీతారాములు, కోల ఉపేందర్, లక్య నాయక్,వుడుమ్ కృష్ణ, ఏల్ఫీరామయ్య, గన్నా నర్సింహరావు,యల్ నాగ బాబు, నాగిరెడ్డి,కుప్పి రెడ్డి నవీన్ రెడ్డి, నాగుల్ పాషా, ఎస్కే సైదా, చెన్నారెడ్డి,ఎల్ రాజేష్,గట్టు గురుమూర్తి,వై రవి,వై శ్రీకాంత్,ఎల్ ఈదయ్య, లింగయ్య, బండారు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State