**జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన""కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ చైర్మన్ కుసుమ వెంకటరత్నం బాబు**
తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ. రావెళ్ళ*** జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు....
కోదాడ మున్సిపాలిటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి....
కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.సూర్యాపేట జిల్లాలో పేరున్న మున్సిపాలిటీ కోదాడ అని మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మునిసిపాలిటీ లో నెలకొని ఉన్న పలు సమస్యలను తీసుకెళ్లారు. కాగా జిల్లా కలెక్టర్ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు ఉన్నారు.