నియంతృత్వ నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

Jun 13, 2026 - 19:53
Jun 13, 2026 - 20:13
 0  9
నియంతృత్వ నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

సూర్యాపేట 13 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో దేశానికి జరిగిన  మేలేమీ లేదని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని అన్నారు..  జవహర్ లాల్  నెహ్రూ పరిపాలనలో దేశంలో అనేక సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు చేశారని అటువంటి గొప్ప నాయకుడుతో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పోల్చడం సరికాదని అన్నారు.  నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో మతతత్వాన్ని పెంచి పోషిస్తున్నదని,  ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చారని ఆయన అన్నారు.  సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని హమి ఇచ్చి యువతను మోసం చేశారని అన్నారు.  గాందేయవాది మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ గురికావడం అనేది అత్యంత దారుణమైన సంఘటనని అన్నారు.  బిజెపి ప్రభుత్వం లో దేశంలో గాంధేయవాదం అంతరించిపోతుందని అన్నారు.  బీహార్ లో బెంగాల్ లో జరిగిన ఎలక్షన్లలో  లక్షల మంది ఓట్లను తొలగించి బిజెపి అక్రమ పద్ధతిలో గెలిచిందని అన్నారు. ఓట్  చోరీ తో పాటు  సీట్ల చోరీ జరుగుతుందని ఆయన చెప్పారు.  తెలంగాణకు బిజెపి ప్రభుత్వం ఏమి చేసిందో తెలియజేయాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్,  కిషన్ రెడ్డిలను  ప్రశ్నించారు.  8 మంది బిజెపి ఎంపీలను  గెలిపిస్తే తెలంగాణకు వారు చేసింది శూన్యమని అన్నారు.  నరేంద్ర మోడీ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జిన్  మాదిరిగా నియంత పరిపాలన చేస్తున్నారని అన్నారు. దేశంలో నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని గద్దె దింపవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. తాను టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సద్దల చెరువు, ఉండ్రుగొండ, దండు మైసమ్మ దేవాలయం అభివృద్దికి నిధులు తీసుకుని వచ్చానని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫి వుల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్,నేరెళ్ల మధు, వల్దాసు దేవేందర్,  పలువురు నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333