ఎయిడ్స్ పై అవగాహన కోదాడ లో

తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎయిడ్స్ పై అవగాహన కోదాడలోని కె .ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్(జాతీయ సేవా పథకం) విభాగం ఆధ్వర్యంలో "ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం" నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాలంటీర్స్ కి ఎయిడ్స్ నివారణ పై అవగాహన నిర్వహించడం జరిగింది. తెలుగు లెక్చరర్, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని, అందుకే ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్స్ ప్రజలకు ఈ మహమ్మారిపై అవగాహన కలగజేయాలని, ఈ వ్యాధి బారిన పడిన వారిని సమాజం నుంచి దూరం చేయవద్దని వారిని ఆదరించాలని అన్నారు. వైద్యశాలలోకి వెళ్లినప్పుడు ఒకరు వాడిన సూదిని, సిరంజీ లను ఇంకొకరు వాడవద్దని, కలుషిత రక్తాన్ని ఆరోగ్యవంతులకు ఎక్కించవద్దని కోరారు. ఈ ఎయిడ్స్ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తుందని, శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుందని అన్నారు.అలాగే ఎయిడ్స్ బారిన పడిన రోగులు మంచి ఆహారం తీసుకొని, ఆరోగ్య సూత్రాలను పాటిస్తే వారు వారి జీవిత కాలాన్ని కొంతకాలం పొడిగించుకోవచ్చు అని అన్నారు. ఈ వ్యాధిపై జాతీయ సేవా పథకం సామాజిక కార్యకర్తలు బ్యానర్ల ద్వారా, పోస్టర్ల ద్వారా, ప్రదర్శనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా యువతలో చైతన్యం తీసుకురావాలని అన్నారు. తదనంతరం కళాశాల లైబ్రేరియన్ జి. నాగరాజు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ కి అలవాటు పడటం వలన అసంకల్పిత పనులు చేసి ఎయిడ్స్ బారిన పడుతున్నారని అలా చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో జి.యాదగిరి, డి. ఎస్. రావు, దస్లి, వాలంటీర్స్ పాల్గొన్నారు.