కోదాడలో పోస్ట్ ఆఫీస్ నూతన భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతూ

Apr 16, 2026 - 19:52
 0  0
కోదాడలో పోస్ట్ ఆఫీస్ నూతన భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతూ

తెలంగాణ వార్త కోదాడ ఏప్రిల్ 16:- కోదాడలో పోస్ట్ ఆఫీస్ నూతన భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతూ భవన నిర్మాణ సాధన కమిటీ గురువారం హైదరాబాదులో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల సర్వీసెస్ N.అనిల్ కుమార్ కు వినతిపత్రం సమర్పించింది. ఎన్నో ఏళ్ల క్రితం కూల్చివేసిన పాత పోస్ట్ ఆఫీస్ భవన స్థానంలో కొత్త  భవననిర్మాణం చేపట్టక పోవడం విచారకరమని కమిటీ పేర్కొంది. ఇప్పటివరకు అద్దె భవనాలలో పోస్ట్ ఆఫీస్ నిర్వహించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సరైన సౌకర్యాలు లేకపోవడం శోచనీయమని కమిటీ పేర్కొన్నది. స్థలానికి సంబంధించిన అన్ని విషయాలు సంబంధిత శాఖకు ఎప్పుడో సమర్పించినట్టు కమిటీ పేర్కొన్నది.    N.అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం సంబంధిత శాఖకు వెంటనే వినతి పత్రంలోని అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పారు.  ఈ కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చిన వారిలో కన్వీనర్ గంధం బంగారు, డాక్టర్ జాస్తి సుబ్బారావు ,విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, రిటైర్డ్ హెడ్మాస్టర్  ముత్తవరపు  రామారావు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333