గణనాథుని దర్శించుకున్న గద్వాల డీఎస్పీ

జోగులాంబ గద్వాల 30 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల మున్సిపాలిటీలోని బీంనగర్ లో అకార్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన మహాగణపతిని శుక్రవారం రాత్రి గద్వాల డీఎస్పీ వై.మొగిలయ్య, సీఐ టంగుటూరి శ్రీను, గద్వాల ఎస్ఐ కళ్యాణ్ కుమార్ సందర్శించారు. వారు గణనాథుడికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని గద్వాల డీఎస్పీ ఆకాంక్షించారు. నిర్వాహకులు అధికారులను శాలువాలతో సత్కరించారు