ఎన్నో రోజుల విద్యుత్ సమస్యను పరిష్కరించిన గ్రామ సర్పంచ్
తిరుమలగిరి 24 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలోని తాటిపాముల గ్రామం పాత బస్టాండ్ దగ్గర 3వ వార్డులో విద్యుత్ స్తంభం లేకపోవడంతో కాలనీవాసులు ఎన్నో రోజులుగా విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గ్రామ సర్పంచ్ బోయపల్లి క్రిష్ణయ్య సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు తక్షణమే స్పందించి విద్యుత్ స్తంభం ఏర్పాటు చేశారు. కాలనీవాసుల సమక్షంలో చేపట్టిన ఈ పనులతో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించింది.విద్యుత్ స్తంభం ఏర్పాటు కావడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మరియు గ్రామ సర్పంచ్ బోయపల్లి క్రిష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.