ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ...అంధకారంలో ఎస్సీ కాలనీ

జిల్లా కలెక్టర్ పర్యటన చేసిన ఫలితం లేదు ....
తు తు మంత్రంగా హడావుడి చేసిన వివిధ శాఖల అధికారులు...
మురికి నీటి దుర్వాసన ....పడకేసిన పారిశుధ్యం....
పట్టించుకోని అధికారులు...
తిరుమలగిరి 29 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ఇటీవల అధిక వర్షం కురవడం వల్ల వరద ముంపు కు గురి అయినా విషయం తెలిసింది దీంతో జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యటించి వరద ప్రభావిత ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యవసర సరుకులు అందించాలని మరియు వైద్య సేవలకు ప్రతి కుటుంబాన్ని పరీక్షలు నిర్వహించి ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు వర్షాకాలం నేపథ్యం వలన విష పురుగులు రాత్రి వేళలో సంచరిస్తుంటాయి కావున విద్యుత్ వీధిలైట్ల నిర్లక్ష్యం చేయొద్దని విద్యుత్ అధికారులకు ఆదేశించిన పట్టించుకోవడం లేదు పంచాయతీరాజ్ శాఖ వారికి డ్రైనేజీ కాలువలు లో ఉండవడిన చెత్తాచెదారం తొలగించి ఇండ్లలో చేరిన మురికి నీటిని తొలగించాలని బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరచాలని తెలిపిన జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని వివిధ శాఖల అధికారులు ...ఇటీవల వర్షాలు కురిసిన నుండి కాలనిలో విద్యుత్ వీధి దీపాలు వెలగడం లేదని దాని వల్ల చీకటైతే చాలు బయటికి రావాలంటే ఇబ్బందిగా ఉందని వయోవృద్ధులకైతే చాలా ఇబ్బందిగా ఉందని దగ్గర లోనే పురాతన మంచినీటి బావి, మరియు పంటచేలు ఉండడం వల్ల విషసర్పలు కూడా వస్తున్నాయని ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆ కాలనీ వాసులు పోతారాజు మధు, పోతారాజు యాదమ్మ, జలగం ఎల్లమ్మ, వేల్పూగొండ యాదమ్మ, పోతారాజు రేణుక, జేరిపోతుల యాకలక్ష్మి, జలగం సుజాత, జలగం అంజయ్య, పల్లెర్ల చంద్రయ్య, బోండ్ల రవి, బోండ్ల వెంకన్న, బోండ్ల ఎల్లేష్ తదితరులు వాపోతున్నారు సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వీధి లైట్లు అమర్చాలని కోరారు...