కవి హృదయం ప్రజా జీవితాన్ని ప్రతిబింబించాలి
ఫోటోలు, ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలకు పాకులాడే వారి సంఖ్య పెరగడం బాధాకరం.
వర్ణనలకు పరిమితమై ఎగరేస్తుoడ్రు గల్లా. ప్రజా సమస్యలు కనిపించడం లేదా ?
---వడ్డేపల్లి మల్లేశం
వాట్సప్ ఫేస్బుక్ ఇతర అనేక మార్గాలలో అనేక రకాల వ్యాపార వాణిజ్య ఆరోగ్య పెట్టుబడిదారీ ప్రకటనలతో ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో కవులు రచయితలు, తామేమి తక్కువ కాదన్నట్లు తమ హావభావాలను నిలబడి, కూర్చుండి, వంగి, వివిధ రీతుల్లో దిగిన ఫోటోలను జన్మదినం ఇతర శుభ కార్యక్రమాలకు సంబంధించి భారీగా ప్రకటనలు ఇవ్వడం సామాజిక సాహిత్య రచన బాధ్యతలను నిజంగా విస్మరించడమే అవుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు నిజంగా కవి హృదయం కకావికల మయ్యే పరిస్థితులు నెలకొన్నాయి కానీ ఆడంబరంగా ఆహ్లాదంగా విలాసకరమైన పద్ధతిలో రచయితలు ప్రచారం కోసమే పాకులాడుతున్న సందర్భంలో కవి హృదయం జనాన్ని విస్మరించినట్లే కదా! ప్రతి చోటా తాము కనిపించాలని, నిరంతరం తమ గురించి ప్రజలు ఆలోచించాలని, ప్రధాన శీర్షికలో తామే ఎప్పుడూ నిలబడాలని, ఇతరులకు అవకాశం ఇవ్వకుండా చేస్తున్న ప్రయత్నాలు కూడా అనేకం. అదే సందర్భంలో ప్రస్తుతం ఫోర్సులో ఉన్నటువంటి కవులు రచయితలు కూడా తమ సామాజిక బాధ్యతను అంతగా గుర్తించడం లేదు. తరాల మధ్య అంతరాన్ని పూరించాలంటే ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి తరాలు తమ కాలము నాటి సామాజిక పరిస్థితులను రికార్డు చేసే పద్ధతిలో నిరంతరంరచన కొనసాగించినప్పుడే గతానికి వర్తమానానికి భవిష్యత్తుకు మధ్య అగాధం ఏర్పడకుండా చూసే అవకాశం ఉంటుంది. "ఆకలితో మలమల మాడే వారికే అన్నం విలువ తెలుస్తుంది. దాహంతో విలవిల కొట్టుకునే వాడికే నీటి ప్రాధాన్యత అర్థం అవుతుంది. అలాగే కవులు రచయితలు కూడా సమకాలీన సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక అంశాల పైన స్పందించడం ద్వారా తమ బాధ్యతను నిర్వహించాలి భవిష్యత్ తరానికి వారసత్వ0గా అందించాలి." ఈ మౌలిక లక్ష్యాన్ని మరిచి పేరు కోసం ప్రచారం కోసం జ్ఞాపికలు పురస్కారాల కోసం ఎగబడుతూ తమ ఉనికిని ప్రత్యేకంగా చాటుకోవడం వివిధ రకాల భంగిమలలో ఫోటోలతో కనిపిస్తే ప్రయోజనం ఏముంది? దానిని ఆహ్వానించే వాళ్ళు ఎవరుంటారు? అలాంటి ఆకర్షణ మనసున్న వాళ్లు తప్ప. అందుకే కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అని శ్రీశ్రీ అన్నట్లు శ్రమజీవులు అన్నార్తులు శరణార్థులు పేదలు ఆదివాసీలు కూ టికి గూటికి గుడ్డకు నోచని అభాగ్యులు అనేక రకాల వివక్షతకు గురవుతున్న వాళ్లు దీనికి కారణం అవుతున్నటువంటి వ్యవస్థను ప్రశ్నించడమే తమ కర్తవంగా భావించిన వాళ్లే నిజమైనటువంటి సాహితీపరులవుతారు. దానికి పెద్ద పేరు హోదా చరిత్ర ఉండాల్సిన అవసరం లేదు. కొందరు సూటిగా ప్రశ్నిస్తే మరికొందరు మర్మ గర్భంగా దాచి దాచి రాస్తారు. సాధారణ భాషలో రాస్తే అది సాహిత్యము కవిత్వం కానే కాదని కఠిన పదాలు ఉపయోగిస్తేనే సాహిత్యం అని విర్రవీగే వాళ్లు కూడా మనలో అనేకం. అసలు సాహిత్యాన్ని అధ్యయనం చేసే వాళ్ళ శాతమే 10% కూడా లేనటువంటి ఈ పరిస్థితులలో కఠిన పదాలను వినియోగించడం ద్వారా ఎంతవరకు సామాన్య ప్రజలు వాటిని చదివి అర్థం చేసుకొని ఆచరిస్తారు?
సమస్యలు ఉన్నచోట సాహిత్యం ఉప్పొంగాలి
సమస్యలను ప్రస్తావించి కార్యకారణ సంబంధాన్ని విశ్లేషించి పరిష్కార మార్గాలను చూపే రచయితలు ప్రజలకు పాలకులకు మధ్య వా రధి గా బాధ్యులుగా ప్రతినిధులుగా పని చేయవలసి ఉంటుంది.అందుకే రచయితలను ఎన్నుకోబడని ప్రజాప్రతినిధులు అంటారు అనడంలో అతిశయోక్తి లేదు .ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం కోసం ప్రజలు తమ పోరాటాలు ఉద్యమాలు నిరసనల ద్వారా సమాజం దృష్టికి తీసుకువస్తారు. అలాంటి పరిస్థితులను సంఘటనలు సందర్భాలను ఆకలింపు చేసుకున్నటువంటి బుద్ధి జీవులు మేధావులు సాహిత్యకారులు రచయితలు కళాకారులు తమ రచనల్లో ప్రదర్శనలో ప్రస్ఫుటంగా వినిపించడం కనిపించడం ద్వారా పాలకులకు వణుకు పుట్టిస్తారు ప్రజాప్రతినిధుల కర్తవ్యాన్ని వెలికి తీస్తారు. "అయితే తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం లాగా తన సమస్యలకు తాను స్పందించకుండా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న శ్రీశ్రీ లాగా నిస్తేజంగా సోమరితనంగా బాధ్యతారా హిత్యంగా ఉంటే అదే సందర్భంలో సమకాలీన సాహిత్యకారులు కూడా ప్రజల నిస్తేజాన్ని సామాజిక దుస్థితిని పరిశీలించకుండా మైమరచి ఉంటే అప్పుడు వ్యవస్థకు జరిగే ద్రోహం అంతా ఇ o తా కాదు. " అంతిమంగా అది పేదలు దళితులు ఆదివాసీలు అన్నార్తులు శరణార్థుల పైన ఆ ప్రభావం పడుతుంది. పేద ప్రజల కోసమే తమ ప్రభుత్వాలు అంటూ చెప్పుకునే వాళ్ళు సామాన్య ప్రజలను విస్మరించి పెట్టుబడిదారీ వర్గం కొమ్ము కాయడంలో అర్థం ఏముంది? దాని అంతరార్థం పేదలను అణిచివేయడం ప్రశ్నించకుండా చూడడమే కదా? ఈ లోతైనటువంటి విషయాన్ని, పాలకుల చేష్టల వెనుక దాగి ఉన్నటువంటి అంతరార్థాలను, ప్రజా వ్యతిరేక కుట్రలు కుతంత్రాలను చే దించడం భగ్నం చేయడం ద్వారా ప్రధానంగా కవులు రచయితలు తమ స్థానాన్ని పదిలపరుచుకోవాలి. లేకుంటే నిన్ను ప్రత్యేక వర్గం గా ప్రజలు గుర్తించవలసిన అవసరం ఏముంది? అయితే నేటి రోజుల్లో సాహిత్యకారులు కూడా క్రమక్రమంగా ఆర్థికంగా ఊప o దుకున్నటువంటి వేళ శ్రామిక దృక్పథం నుండి ఆడంబర దృక్పథంకు పరిణామం చెందుతున్న సందర్భంగా సామాన్య ప్రజల జీవితాలను ప్రతిబిమించడానికి అంతగా సిద్ధపడటం ఇష్టపడడం లేదు. దాని కారణంగానే అనేకమంది రచయితలు తమ కర్తవ్యాలను పక్కనపెట్టి ఆకర్షణకు ప్రచారానికి పాల్పడుతున్న సందర్భాలు అనేకం అని సామాన్య ప్రజలే అక్కడక్కడ విమర్శిస్తున్నటువంటి సందర్భంలో కవులు రచయితలుగా మనం స్పష్టమైనటువంటి గీత గీసుకొని లక్ష్యాన్ని నిర్దేశించుకుని శక్తిని అన్ని వర్గాల నుండి కూడగట్టుకొని అ నవలసిన మాటలను అంటూ వినవలసిన మాటలను వింటూ స్పందించాల్సిన చోట స్పందించి ప్రజల పక్షాన సత్తా చాటినప్పుడే నిజంగా కవులు కళాకారులకు వచ్చే గుర్తింపు ఎనలేనిది. ఒసేయ్ రాములమ్మ చిత్రంలో తాడితులు పీడితులు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కాపాడుమంటూ అని అరిచిన సందర్భాన్ని ఆ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన గద్దర్ గారు అన్నా అన్నా అని అరిచి బాధ్యతను మాలాంటి వాళ్ల పైన పెట్టి మీరు మౌనంగా ఉంటే మీ సమస్యలు పరిష్కారం కావు సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడే పరిష్కార మార్గాలు వెతకాలి మంటలు రాజెయ్యాలి పునాదులు తవ్వాలి ఉద్యమాన్ని నిర్మించాలిఅని చేసిన హెచ్చరిక మనకు బహుశా గుర్తుండే ఉంటుంది. అందుకే సమస్యలు ఉన్నచోట కళాకారులు కవులు ప్రజలను పలకరించాలి ప్రజలు తమ సమస్యలను చెప్పుకొని కవుల మద్దతు కూడా కట్టుకోవాలి ఇది పరస్పరం జరగాల్సిన ప్రక్రియ.
కవులు రచయితలు మౌనం వీడండి :-
అవసరమైన చోట కవులు మౌనంగా ఉండడం ఎంత ప్రమాదకరమో ప్రజా జీవితానికి భిన్నంగా ప్రజా మోదానికి వ్యతిరేకంగా ఆడంబర సాహిత్యాన్ని సృష్టించడం కూడా అంతే స్థాయిలో నేరమవుతుంది. రచయితలు కవులు అంటే పట్టాదారులు అనుకొని పొంగి పోవాల్సిన అవసరం లేదు. పాలకులు ఎలానైతే ప్రజలకు కాపలా దారులు అని చెప్పుకుంటున్నారో కవులు రచయితలు కూడా ప్రజలకు సేవ చేసే చైతన్యం చేసే సహచరులు మాత్రమే అని అంగీకరించాలి. కానీ పొందిన పురస్కారాలు అందుకున్న సన్మానాలు చేరుకున్న ఆర్థిక స్థితిని చూసుకొని బాధ్యతలు విస్మరిస్తే వాళ్లు కూడా ప్రజా ద్రోహులు గానే మిగిలిపోవాల్సి ఉంటుంది. సినిమాల్లోని సంభాషణలు కధ అంశాలు సీరియల్లలో ఉన్నటువంటి సంభాషణలు దృశ్యాలు అశ్లీల అo గాoగ ప్రదర్శనలు ఆటవిడుపు మాటలు పాటలు అర్థం లేని ఆరాటాలు పోరాటాలను ఇకనైనా పాలకులు నిషేధించే ప్రయత్నం చేయాలి. సంస్కృతి విచ్ఛిన్నమై వికటాట్ట హాసం చేస్తున్న సందర్భంలో దానిని మరింత రెచ్చగొట్టే స్థాయిలో క్లబ్బులు పబ్బులు ఈవెంట్లను అనుమతించి ఇప్పటికే ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసింది. అలాంటి ద్రోహాన్ని తిప్పి కొట్టి నిషేధించేలా ఒత్తిడి చేయాల్సిన బాధ్యత కూడా కవులు రచయితల పైన ఉంది .కేవలం కొద్ది మంది నటులు కళాకారులు సిబ్బంది కోసం ప్రజలకు ద్రోహం తలపెట్టే రీతిలో సీరియల్ లను సినిమాలను నిర్మించి ప్రజల దగ్గర నుండి నిర్బంధంగా వసూలు చేయడం అంటే అది ఆత్మహత్యా సదృశ్యమే కాదు సామాజిక బాధ్యతను విస్మరించి ప్రజానీకానికి చేస్తున్న పరమ ద్రోహం గా భావించవలసి ఉంటుంది. ఇక్కడే బుద్ధి జీవులు మేధావులు కఠిన పాత్ర పోషించి పాలకులను హెచ్చరించి రచయితలు యొక్క తప్పుడు భావనలను సరి చేయడం ద్వారా మాత్రమే సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలి కానీ పేరుతోనో, చరిత్రతోనో, సీనియార్టీతోని గొప్పలు చెప్పుకోవడం ప్రచారం చేసుకోవడం నిజంగా సిగ్గుచేటు. అందరం ఆ వైపుగా .సాంస్కృతిక పునరుజ్జీ వనానికి అంకితం అవుదాం. మన లోపాలను తప్పులను అశ్లీల సాహిత్యాన్ని దృశ్యాలను తిప్పి కొడదాం అంటూ రచయితలు కవులు ప్రతిజ్ఞ చేస్తేనే ప్రజా జీవితంలో నెలకొన్న అనేక రుగ్మతలు పరిష్కారం అవుతాయి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)