ఎండిపోతున్న పంటలను చూసి చలించిపోతున్న బీరం హర్షవర్ధన్ రెడ్డి
27-10-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.చిన్నంబావి మండలంలో పలు గ్రామాలలో ఎండిపోయిన పంటలను చూసి చలించిపోతున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి . పెద్దద మార, చెల్లెపాడు నుండి చిన్నంబావి వరకు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. వెల్టూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ సాగునీరు అందించామని ప్రస్తుతం కరెంటు కోతలతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి ఎకరానికి 20వేల పరిహారం రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేక సాగునీరు కరెంటు ఇవ్వడం చేతకాక రైతులను పంటలు వేసుకోవద్దని ఈ తెలివి లేని ముఖ్యమంత్రి అలాగే ఈ స్థానిక ఎమ్మెల్యే మంత్రి సొంత మండలాల్లో రైతుల పంటలు ఎండిపోతుంటే విదేశాలకు వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సత్వరమే ఎండిపోయిన రైతుల పంటలను పరిశీలించి ఎండిపోయిన పంటలకు ఎకరానికి 20000 చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని భారత రాష్ట్ర సమితి తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు లేనియెడల రైతులతో మహా ధర్నాకు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో స్థానిక మంత్రి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ యొక్క కార్యక్రమంలో చిన్నంబావి మండల మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జెడ్పిటిసి కేసు రెడ్డి వెంకట్ రమణమ్మ చిన్నారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఈదన్న పెద్దమారు మాజీ సర్పంచ్ గోవింద్ శ్రీధర్ రెడ్డి , వెలగొండ సర్పంచ్ శరత్ కుమార్ రెడ్డి, బిక్కిం రాజు రెడ్డి, మియాపూర్ సుధాకర్ రెడ్డి, మరియు గ్రామాల నుండి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.