బతుకమ్మ పూల పండుగ లక్ష్యాలు క్రమంగా మారుతున్నాయి

Oct 24, 2026 - 23:39
 0  0

బతుకమ్మ పూల పండుగ లక్ష్యాలు క్రమంగా మారుతున్నాయి.*  ప్రకృతిని ఆరాధించడం  ప్రధాన లక్ష్యం అయితే  పూలను సమీకరించి  ఇచ్చే వాళ్ళ కష్టాన్ని  గుర్తించడం కూడా భాగమే.
*--***---**
---వడ్డేపల్లి మల్లేశం 
పూల పండుగ బతుకమ్మ అనగానే  ప్రకృతి పండుగ అని  ప్రకృతిని గౌరవించుకోవడం  పర్యావరణ పరిరక్షణకు   పునరంకితం కావడం
ప్రధాన అంశాలుగా నేడు ఈ పండుగ  అమలులో కొనసాగుతున్నది.  బతుకమ్మ అనగానే ఒక దేవత అనె  అమూర్త భావనను వ్యక్తం చేసే పరిస్థితుల నుండి  కాయకష్టం చేసి బ్రతికే వాళ్ళు,  ప్రకృతిని ఆరాధించే వాళ్ళు,  శ్రమను గౌరవించడం,  శ్రమైక జీవన సౌందర్యాన్ని  ఎలిగెత్తి చాటడం,  మనిషి మనుగడకు ఆధార భూతమైనటువంటి ప్రకృతి విషతుల్యం కాకుండా కాపాడుకోవడం కూడా  ఈ పండుగలోని ప్రధానమైన అంశాలుగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.  ????చారిత్రక పౌరాణిక  ఇతిహాసాలతో కూడుకున్నటువంటి అనేక కథనాలు అమలులో వాడుకలో ఉన్నప్పటికీ  కుటుంబ బంధాలు మానవ సంబంధాలు  విచ్ఛిన్నమవుతున్న నేపథ్యంలో  ఇలాంటి కథనాలకు మరింత చారిత్రక ప్రాధాన్యత ఉంటుంది.  కుటుంబ బంధాలను కాపాడుకోవడంలో  ప్రధానంగా స్త్రీలు ముందు వరుసలో ఉండాలి కానీ  ఒక ఇంట పుట్టిన స్త్రీ మరొక ఇంట  కోడలుగా వ్యవహరిస్తూ ఉంటే  ఆడబిడ్డలను  గౌరవించి  పరిరక్షించుకునే క్రమంలో చూపుతున్నటువంటి వివక్షత,  చిన్న చూపు, అవమానాల వంటి  సంఘటనలు ఇ ప్పటికీ కుటుంబాలలో దర్శనమిస్తూ  ఎంతోమంది ఆడపిల్లలు తమ తల్లి గారి ఇంటికి దూరం అవుతున్న నేపథ్యాన్ని అర్థం  చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది .వివాహమై అత్తవారింట్లో ఉన్న ఒక ఆడపడుచు కుటుంబము భర్తతో  పడుతున్న ఆగ చాట్లు ఇబ్బందులను భరించలేక తన తల్లి గారింటికి అన్నదమ్ములకు  సమాచారం చెప్పి పంపితే  వాళ్లు రాలేక  ఇక్కడ ఈమె సర్దుబాటు చేసుకోలేక  ఆత్మహత్య చేసుకునే క్రమంలో అడవికి పోయి  అంతర్థానం అయ్యిందని ఆమె తంగేడు చెట్టుగా మారిందని  ఒక కథనం అమల్లో ఉంది. సమ్మక్క సారక్క కూడా యుద్ధంలో చనిపోయినప్పుడు  పరిగెత్తి గాయాలతో  సుదూరంగా వెళ్లి కుంకుమ భరణి రూపంలో మారిందని చెబుతూ ఉంటే  ఇక్కడ ఆడబిడ్డ  చెట్టుగా మారిందని చెప్పడంలో ప్రకృతికి పూలకు  శ్రీ తత్వానికి ఎంతో సంబంధం ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది .తన  మెట్టినింట పడుతున్న బాధను తల్లి గారి ఇంటికి  చెప్పి పంపినప్పటికీ తన వదిన  అన్నలు సహకరించకపోవడం రాకపోవడంతో ఆ బాధ నుండి విముక్తి చెందడానికి ఒక చెట్టుగా మారిందనె ఆవేదన  కరుడుగట్టినటువంటి కుటుంబ హింసకు  కుటుంబ వివక్షకు అద్దం పడుతున్నది.  అందుకే తంగేడు చెట్టు నుండి వచ్చే పువ్వు ద్వారా బతుకమ్మలను పేర్చి  ముఖ్యంగా ఆడపిల్లలు ఎంతో ఇష్టంగా అలంకరించుకొని  పాటలు పాడుతూ  పది రోజులుగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఉత్సవం  తెలంగాణలోనూ ఇతర దేశాలలోని తెలుగు వాళ్ళ మధ్యన  ఎంతో కోలాహాలంగా నిర్వహించబడుతున్నది.
       ప్రకృతి  మానవ సంబంధాలు కుటుంబ బంధాలు పూల పండుగ అని రకరకాల పేర్లు చెప్పుకొని  పూలను ఆరాధించి  ప్రకృతిని గౌరవించే పరిరక్షించుకోవడానికి ఒక వేదికగా ఒక సందర్భంగా ఉపయోగపడుతున్నటువంటి ఈ పండుగ ప్రాశస్త్యం  వెనుక అనేక  గాధ లు ఉన్నప్పటికీ  విచ్ఛిన్నమవుతున్నటువంటి మానవ సంబంధాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని మాత్రం నొక్కి చెబుతున్నది అనడంలో సందేహం లేదు.  ఇప్పటికీ బతుకమ్మ పండుగ సందర్భంగా  ఆడపిల్లలు ఎంత వయస్సు పైబడినప్పటికీ తల్లిగారింటికి రావడం  ప్రేమతో ఆప్యాయతో  పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది  ఇదే సందర్భంలో కొంతమంది  స్త్రీ పురుషులు  తమ ఇంటి ఆడపడుచును తీసుకురావడంలో  కఠినత్వాన్ని ప్రదర్శిస్తున్న మాట కూడా వాస్తవం. అంత ఎందుకు రాఖీ పండుగ సందర్భంగా కూడా పుట్టిన ఇంటికి వచ్చి  అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి  చొరవ చూపితే  నిరాకరించేవాళ్లు, గెంటివేసేవాళ్లు,  బంధాన్ని తెంపుకునేటువంటి అన్నదమ్ములు వదినలను కనుక గమనిస్తే  ఆడపిల్లలది కూడా తమ ఇంట ఒకనీతి తమ పుట్టినింట మరొక నీతి అన్నట్లుగా ఉంది కదూ !
    పూలను సమీకరించడం పెద్ద పనిగా మారింది
************
  ఈ పండుగ నిర్వహించుకునే ప్రజలకు  ప్రకృతిని పూలను గౌరవించడంతోపాటు తమ ఇంటి ఆడపిల్లలను ఆహ్వానించి  పండుగ సందర్భంగా గుర్తించి గౌరవంగా సాగనంపే  బాధ్యతలు ఉంటే  ఇటీవల కాలంలో పండుగకు బతుకమ్మలను పే ర్చుకోవడానికి  పువ్వును సమీకరించుకోవడం పెద్ద కష్టంగా మారింది.  గతంలో  దశాబ్దాల క్రితం నుండి నా అనుభవంలో  20, 30 కిలోమీటర్ల సుదూర ప్రాంతానికైనా వెళ్లి కాలినడకన  తంగేడు  ఇతర అడవుల్లో దొరికే పూలతో పాటు ఇండ్లలో ఇంటి పరిసరాల్లో దొరికే పువ్వులను కూడా పెద్ద మొత్తంలో సేకరించి బతుకమ్మలను పే ర్చడంలో పోటీపడేవాళ్లు.  ప్రతి పనిని ఇష్టంతో చేసిన కారణంగా కష్టమనిపించేది కాదు ఆనాడు  పేదరికం ప్రతి ఇంట అంతో ఇంతో  తాండవించినా కూడా తమ తోబుట్టువులను ఆదరించి ఆహ్వానించి పండుగలు జరుపుకోవడంలో నిండు మనసుతో ఆనాడు వ్యవహరించే వాళ్ళు.  కానీ ఈనాడు ఆడపిల్లలను ఇంటికి పిలవడానికి మగవాళ్లకు శక్తి సరిపోవటం లేదు,  కుటుంబ ఇల్లాలు యొక్క జోక్యం ఆధిపత్యం ఎక్కువ కావడం వలన  పండుగకు ఆహ్వానించడం గగనకుసుమంగా మారింది.  ఒకవేళ మనసు ఉండి  తోబుట్టువులనే భావనతో పిలవడానికి   సాహసిస్తే వాళ్ళ ఇంట్లో నిత్యం యుద్ధమే. స్త్రీల పండుగకు స్త్రీలను ఆహ్వానించడానికి స్త్రీల వలన యుద్ధం ఘర్షణ సంఘర్షణ జగడాలు  రూపుదిద్దుకోవడంలో వెనక ఔచిత్యం ఉందా? అలాంటి  దుష్ట బుద్ధి నుండి కొంతమంది అయినా బయటపడాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా మనం నొక్కి చెప్పుకోవాల్సి ఉంది.  "తను పుట్టిన ఇంట్లో సగౌరవంగా  ఆదరించబడాలని ఆశించి వచ్చే ఆడబిడ్డలకు  సరైన పోషణ ఆదరణ లేక  వృద్ధులైన తల్లిదండ్రుల యొక్క జోక్యం అంతగా లేని కారణంగా  అన్నదమ్ములు వదిన మరదళ్లతో ఇక్కట్లు తప్పడం లేదు".  ఈ శాస్త్ర సాంకేతిక యుగములో కూడా  స్త్రీలు అనేక ఇబ్బందులకు అణచివేతకు వివక్షతకు గురవుతున్నారంటే  ఈ పండుగకు అంతో ఇంతో ఆధారమైనటువంటి కథనాలలో చెప్పుకున్నటువంటి స్త్రీ వివక్షత ఆ కాలం  లో ఇంకెంత ఇబ్బంది పడినారో అర్థం చేసుకోవచ్చు.  పండుగను సందర్భంగా తీసుకొని  కథనాలు  చారిత్రక అంశాల ఆధారంగా  మానవ సమాజం నిండుగా ఆలోచించే ప్రతి వారికి ఒక గుర్తింపును ఆదరణను ఇవ్వాల్సిన అవసరం ఉంది.  అంతేకాకుండా ఈనాడు ప్రకృతి పర్యావరణం  సమాజం విచ్చిన్న కార్యక్రమాల కారణంగా  విషపూరితమవుతున్న సందర్భంలో  అడవుల శాతం తగ్గడమే కాకుండా  ఎల్ నినో వంటి అనేక దుష్ప్రభావాలతో తాగు సాగునీటికి కరువులు ఏర్పడి  ప్రకృతి  విలయతాండవం చేస్తున్న సందర్భంలో ప్రకృతి నుండి  రక్షించుకోవడానికి గుణపాఠం నేర్చుకోవడానికి మానవ కుటుంబ సంబంధాలను పునర్ నిర్మించుకోవడానికి బతుకమ్మ పండుగ ఒక వేదికగా మారితే అంతే చాలు.  అంతేకాదు పువ్వులను సమీకరించుకోవడం అధికష్టంగా మారిన ఈ సందర్భంలో  అనేకమంది  కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళు ఊరు వాడ అడవి తిరిగి  చెట్టు చేమ  సందర్శించి పూలను సమీకరించుకొని  ఆ ఒక్క రోజైనా   పూలను అమ్ముకొని తమ జీవితాన్ని జరుపుకుంటున్నటువంటి కార్మిక  కుటుంబాలను కూడా సగవురవంగా ఆదరించాల్సిన అవసరం చాలా ఉన్నది .
కాలానుగుణంగా మరింత పదు నె క్కా లి:-
************
       మానవ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, తోటి మనిషిని సాటి మనిషిగా గౌరవించడం,  కుటుంబ బంధాలలో గతంలో నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలను మరింత బలోపేతం చేసుకోవడం,  ఆ ఇంట పుట్టిన ఆడబిడ్డలకు తగిన ప్రాధాన్యతనివ్వడం,  ప్రకృతి విషపూరితము కాకుండా ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి అనేక రకాల రసాయన పదార్థాలను తగ్గించుకొని  ప్రకృతికి బాసటగా నిలవడం,  శ్రమను గౌరవించడం వంటి ఉదాత్త లక్షణాలను  పెంపొందించుకోవడం ద్వారా మన యొక్క చైతన్యాన్ని కర్తవ్యాన్ని ప్రకృతి మానవ సమాజం పట్ల బాధ్యతను  గుర్తించవలసిన అవసరం ఎంతగానో ఉంది.  ఆడంబర జీవితానికి మాత్రమే అలవాటు పడి  శ్రమను శ్రామికులను అగౌరవపరిచే దుష్ట సంప్రదాయానికి తిలొదకాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది.  బతుకమ్మ పండుగ ప్రాశస్యాన్ని గౌరవిద్దాం మరింత ఇనుమడింప డింప చేద్దాం.  కుటుంబ సంబంధాలను బలోపేతం  చేసి నిరంతరం కొనసాగేలా  ప్రతిన బూ నుదాం. ఈ పండుగలు ప్రధాన పాత్ర పోషించే స్త్రీల మనస్తత్వాన్ని  విశాలంగా మార్చుకోవడానికి మనం కూడా మన వంతుగా సహకరించి పండుగల కు పూర్తి వైభవాన్ని అందిద్దాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333