ఉపాధి కూలిగా మారిన ఎమ్మెల్యే మందుల సామెల్
తిరుమలగిరి 10 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉపాధి కూలీగా మారిన మందుల సామేలు ఉపాధి కూలీలతోపాటు గడ్డపారవేసి పారపట్టి తట్ట నింపి ట్రాక్టర్లో మట్టి పోశారు ఎమ్మెల్యే మందుల సామెల్ తొండ గ్రామంలో చేతి గుర్తు పైన ఓటు వేసి కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అలాగే ఉపాధి కూలీల తోటి మహిళలతోటి చిన్నారుల తోటి మాట ముచ్చట మాట్లాడారు అనంతరం గ్రామంలో ఉన్న వివిధ సమస్యల పట్ల వివిధ సంఘ నాయకులు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను వారికి వివరించారు మాట్లాడుతూ ఎన్నికల అయిపోయిన తర్వాత గ్రామానికి వస్తా వచ్చి నేనే స్వయంగా ఇక్కడే ఉండి కొన్ని సమస్యలు తీరుస్తానని ఎవరు ఆదర్య పడవద్దు అని మరియు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కావున గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్దడానికి కొద్దిగా సమయం పడుతుంది అనుకున్న ఐదు హామీలను కచ్చితంగా నెరవేరుస్తాం ఇందులో ఎలాంటి మార్పు లేదు కచ్చితంగా చేతి గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమీలాల్ మండల కాంగ్రెస్ నాయకులు సుంకరి జనార్ధన్ దాచేపల్లి వీరశేఖరయ్య దాచేపల్లి వెంకన్న తొండ గ్రామ మాజీ సర్పంచ్ శాతవాహనరావు గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు వేల్పుల వెంకన్న లోడే సాయి మధు ప్రశాంత్ప కిరణ్ లు గ్రామాల మాజీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు