ఉద్యోగ పదవి విరమణ సన్మానం కార్యక్రమం

Feb 2, 2026 - 22:56
Feb 2, 2026 - 22:56
 0  4
ఉద్యోగ పదవి విరమణ సన్మానం కార్యక్రమం

అడ్డగూడూరు 02 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– 

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామ ఉద్యోగ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వివిధ రకాల రంగాలలో సర్వీస్ పూర్తి చేసి పదవి విరమణ చేసిన వారికి ఉద్యోగ సహకార సంఘం ఆధ్వర్యంలో కానుగుల రాము ఆగ్రో కెమికల్ కంపెనీ, బండి భిక్షం టీచర్,పొన్నాల ఉదయ్ కుమార్ ఆర్మీ,పొన్నాల రమేష్ ఆర్మీ.దామెర్ల వీరయ్య ఆర్మీ, బొమ్మగాని భద్రయ్య ఆర్మీలను సర్వీస్ పూర్తి చేసిన సందర్భంగా వారికి ఉద్యోగ సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవికాల్వ ఉద్యోగ సహకార సంఘం అధ్యక్షులు కంచుగట్ల క్రిష్ణయ్య,ప్రధాన కార్యదర్శి దామెర్ల వీరయ్య,ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ వల్లంబట్ల రమాదేవి, ఉపసర్పంచ్ కంబాల వీరయ్య,ఉద్యోగ సహకార సంఘం గౌరవ అధ్యక్షుడు ఎస్.కె అబ్బాస్ అలీ, సభ్యులు పొన్నాల సత్తయ్య, కందుకూరు అంజయ్య,పొన్నాల నర్సయ్య, కంచుగట్ల వెంకన్న, పనుమటి అంజయ్య , కంచుగట్ల శ్రీశైలం, బండి వినయ్, కేసరపు ఆంజనేయులు, దామెర్ల వెంకన్న, పొన్నాల శేఖర్, బండి నాగరాజు, రవి అశోక్,మమత, గ్రామస్తులు నక్క అబ్బయ్య, బొమ్మగాని లక్ష్మయ్య, అక్కెనపెల్లి నర్సయ్య, వల్లంభట్ల రవిందర్ రావు తదితరులు పాల్గొన్నారు.