సబ్ స్టేషన్ మర్మాత్తుల కారణంగా విద్యుత్ నిలిపివేత ఏ.ఈ ఉమా
అడ్డగూడూరు 02 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:–
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని అజీంపేట సబ్ స్టేషన్ లో 03/02/2026 మంగళవారం రోజున రెండు ఫీడర్లకు డి రేపాక మరియు అజీంపేట ఫీడర్ల గ్రామాలకు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయడం జరుగుతుందఅని అడ్డగూడూరు విద్యుత్ ఏఈ భూక్యా ఉమా తెలిపారు.ఈ సందర్బంగా ఏఈ మాట్లాడుతూ వేసవి కాలంలో సబ్ స్టేషన్ లో విద్యుత్ కు అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్ అందిచడానికి ఇప్పుడు ఉన్న 5ఏంవిఏ పవర్ ట్రాన్సపార్మర్ స్థానంలో అదనపు 8ఏం విఏ ట్రాన్సపార్మర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే చిన్న చిన్న మార్మతులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి రెండు ఫీడర్ల గ్రామాల రైతులు,విద్యుత్ వినియోగదారులు, రైతులు గ్రామస్తులు మాకు సహకరించగలరుఅని ఏఈ ఉమా ఒక ప్రకటనలో తెలిపారు.