ఎస్ ఐ ఆర్ కార్యక్రమం 100%పూర్తి.ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడి.

Aug 8, 2026 - 01:24
 0  1
ఎస్ ఐ ఆర్ కార్యక్రమం 100%పూర్తి.ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడి.

 జోగులాంబ గద్వాల 7 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- .మండలం లో వివిధ గ్రామపంచాయతీలలో పోలింగ్ బూతుల వారీగా ఎస్ ఐ ఆర్ ఓటర్ జాబితాకు సంబంధించిన ఓటర్ జాబితా ప్రకారం బిఎల్ఓ లు నిర్వహించిన సర్వే కార్యక్రమం మండలంలో ముసాయిదా ఓటర్ జాబితా 100% పూర్తయిందని  తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు జులై 25 నుండి జూలై 24 వరకు బిఎల్ఓ లు ప్రతి ఇంటికి తిరిగి ఇంటింటి నెంబరు ఆధారంగా కుటుంబాలకు ఎనిమరేషన్ ఫారాలను ఇవ్వడం జరిగిందని తహసిల్దార్ తెలిపారు. ఇటిక్యాల మండలంలో గ్రామపంచాయతీలలో దాదాపుగా 19 వేల 209 మంది ఓటర్లు జాబితా గతం లో నుండి వివరాలు ఉన్నాయని తహసిల్దార్ తెలియజేశారు. ఎస్ ఐ ఆర్ కార్యక్రమం ద్వారా కొత్తగా ఓటర్ల నమోదు కార్యక్రమం గతంలో నుండి ఓటర్ జాబితాలో ఉండి మరణించిన వారి పేర్లను తొలగించడం మరణించిన వారి సంఖ్య (566) శాశ్వతంగామార్చబడిన వారి సంఖ్య(1058) ఇప్పటికీ నమోదు చేసుకున్న వారి సంఖ్య(146) గై రాజారు వారి సంఖ్య(  35 ) ఇతరులు వారి సంఖ్య (3)     టోటల్ ఉఫ్ అస్డ్   (1808) మొత్తము ఓటర్ల సంఖ్య   (19209) ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. గద్వాలజిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇచ్చిన ఆదేశం మేరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పూర్తయిందని తహసిల్దార్ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333