ఉత్తర వాహిని తుంగభద్ర నది తీరాన వెలసిన అనంతరం పుణ్యక్షేత్రంలోని

శ్రీ యోగి నరసింహ స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు.

May 21, 2024 - 19:02
 0  40

 జోగులాంబ గద్వాల 21 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్. ఉత్తర వాహిని తుంగభద్ర నది తీరాన వెలిసిన అనంతరం పుణ్యక్షేత్రంలోని శ్రీ యోగి నరసింహ స్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం నరసింహ స్వామి జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దేవల కృష్ణమూర్తి శర్మ పంచసూక్తలతో స్వామివారి మూలమూర్తికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. కార్యనిర్వాహణ అధికారి పురేందర్ కుమార్ ఆలయ చైర్మన్ చిన్నకృష్ణయ్యలు నరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కాగా ఈ వస్త్రాలను స్వామివారికి అలంకరించి పూలంగి సేవలు నిర్వహించి మహా నివేదనలు దశవిధ హారతులు సమర్పించారు భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం ప్రదోషకాలంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ కార్య నిర్వహణ అధికారి పురేంధర్ కుమార్ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333