ఈనెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్ :జులై 11: ఈనెల 24 నుంచి తెలం గాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగను న్నాయి. అసెంబ్లీ నిర్వ హణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖాధి కారులతోఈరోజు సమీక్షిం చారు.
సీఎస్, డీజీపీ ఇతర ఉన్న తాధికారులు హాజరయ్యా రు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై స్పీకర్, మండలి ఛైర్మన్ పలు సూచనలు చేశారు.
సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికా రులను ఆదేశించారు.
కేంద్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాతనే రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉండడంతో అందుకు తగ్గట్లు అధికారు లు సిద్ధం కావాలని సూచించారు.