ఇసుక అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టాలి:జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్
జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. సోమవరం ఐ.డి.ఓసి కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన జిల్లా ఇసుక నిర్వహణ మరియు టాస్క్ ఫోర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ , జిల్లా ఎస్పీ రితి రాజ్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ, జిల్లాలో ఉన్న ఇసుక రీచ్లకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు. పోలీస్, రెవెన్యు , మైనింగ్ అధికారులు సమన్వయము చేసుకొని ఇసుక సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఇసుక అక్రమ రవాణా కు కమిటీ ఏర్పాటు చేయాలని, మండలాల వారిగా సి.సి కెమెరాల వివరాలను అడిగి తెల్సుకున్నారు. సి.సి కెమోరాల నిఘాతో వాహనాల తణిఖీ జరగాలని జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై కూడా నిఘా పెంచాలన్నారు. ఆయా మండలాల పరిధిలో ఎక్కడ ఇసుక అక్రమ రవాణా జరిగినా తహాసిల్దారులు, ఎస్. ఐ లు వెంటనే స్పందించి అరికట్టాలని సూచించారు. మండలాల తహసిల్దార్ లతో ఇసుక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పోలీస్ మరియు రెవెన్యు ఇసుక వాహనాలను తనిఖీ చేసి అక్రమంగా తరలించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. తహసిల్దార్ పరిధిలో పట్టుకున్న వాహనాలకు తప్పని సరిగా జరిమానా విధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ రామచందర్ , అడిషనల్ ఎస్పీ శేఖర్, డి.ఎస్.పి సత్యనారాయణ, మైనింగ్ ఎ.డి. బి.వి రమణ , డి.జి.డబ్లు.ఓ మోహన్, డి.ఐ.ఓ ఇరిగేషన్ శ్రీనివాస్, డి.ఐ.ఓ గద్వాల్ వెంకటేశ్వర్ రావు , తహసిల్దార్ మంజుల , హరిక్రిష్ణ , సి.ఐ లు ,ఎస్.ఐ. లు, తదితరులు పాల్గొన్నారు....