ఇందిరా వృధా అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

Feb 23, 2024 - 20:08
Feb 24, 2024 - 20:08
 0  6
ఇందిరా వృధా అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

 మునగాల 23 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి :-  మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న అనాధ వృద్ధ అనాధ ఆశ్రమంలో. మండల పరిధిలోని కృష్ణా నగర్ గ్రామానికి చెందిన. వీరంశెట్టి సైదులు కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాధ వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముందుగా. వృద్ధుల అనాధ ల సమక్షంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. ఏఎస్ఆర్ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్. ఆవుల సైదేశ్వర రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా సైదేశ్వర రావు మాట్లాడుతూ. ఇలా పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు పోకుండా ప్రతి ఒక్కరు వారి వారి. కి అందుబాటులో ఉన్న ఇలాంటి ఆశ్రమాలలో. ఉన్న వృద్ధులకు మానసిక వికలాంగులకు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఆదుకునేందుకు ముందుకు రావాలని అన్నారు ప్రతి ఒక్కరూ సైదులు ను ఆదర్శంగా తీసుకొని. వారి వారి గృహాలలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా. ఇలా ఆశ్రమాలలో వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి. వారికి అండగా నిలవాలని అన్నారు. ఈ సందర్భంగా. ఆశ్రమంలో ఉన్న వృద్ధులు వరుణ్ కి. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇలా ఆశ్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు దాతృత్వం గల దాతలు ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు. సహకారాలు అందించి ఇంకా ఇలా నిరాదరణకు గురైన. వారిని ఆదుకునేందుకు సహకరించాలని సైదేశ్వర్ రావు కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ ముడుంబై. రామయ్యగారు. సైదమ్మ ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State