అక్రమ కబ్జా దారుల నుండి అమ్మ వారి ఆలయం నేటితో విడుదల.
పరిష్కారం చేసిన ప్రభుత్వ అధికారులకు పచ్చర్ల గ్రామస్తుల అభినందనలు.
జోగులాంబ గద్వాల 2 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- రాజోలి. మండల పరిధిలోని పచ్చర్ల గ్రామంలో గత నాలుగు సంవత్సరాల నుంచి పచ్చర్ల లస్మమ్మ అమ్మవారి ఆలయ స్థలం ఆక్రమనకు గురై అనేక వివాదాలు చోటు చేసుకున్నవి. అయితే గత కొంత కాలంగా ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను గమనించి అక్రమాదారులని స్థలంలో నుంచి తొలగించి కంచె వేయడంతొ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వివాద కారణంతొ అమ్మవారికీ మొక్కులు చెల్లించుకోలేక, పూజలకీ నోచుకోక బాధపడిన పచ్చర్ల గ్రామ ప్రజలు, ప్రభుత్వ అధికారుల పరిస్కారంతొ స్థల వివధాన్ని రద్దు చేసి మళ్ళీ అమ్మవారి సేవలకు అవకాశం కల్పించిన ప్రభుత్వ అధికారులు. లోకాయుక్త కోర్టు , రెవెన్యూ, మరియు మండల పరిషత్, పంచాయితీ సెక్రెటరీ. రాజోలి పోలీస్ సిబ్బంది అందరికి అభినందనలు తెలుపుతూ గ్రామస్థులు, సొసైటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.