రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలి

Oct 9, 2025 - 13:57
 0  4
రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలి

అడ్డగూడూరు 08 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్;–  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి. ఆర్.గవాయ్ పై దాడి చేసిన ఆర్.ఎస్.ఎస్ గుండాల కుట్రలో భాగంగా రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని  అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్దదళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసారు ఈ సందర్బంగా మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలెంల విద్యాసాగర్ మాట్లాడుతూ..సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేయడం హెయమైన చర్య ఈ దాడి భారత రాజ్యాంగం పై డాడీగా అభివర్ణించారు.ఇది ఆర్ ఎస్ ఎస్ మనువాదుల కుట్రలో భాగమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం.ఆర్ పి.ఎస్ మండల అధ్యక్షులు సూరారం రాజు మాదిగ ఎం.ఆర్.పి ఎస్(టి.ఎస్)వర్కింగ్ ప్రెసిడెంట్ బాలెంల పరుశురాములు దళిత సంఘాల సీనియర్ నాయకులు బాలెంల సురేష్ ఎం.ఆర్.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్ ఎం.ఆర్ పి.ఎస్.సీనియర్ నాయకులు బాలెంల అయోధ్య,బాలెంల రాజు,బాలెంల మల్లయ్య, బాలెంల మహేందర్,బాలెంల అరవింద్,తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333