ఆ గ్రామాలకు పల్లె వెలుగు బస్సు వచ్చేనా.?
జోగులాంబ గద్వాల 8 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలంలోని పలు గ్రామాలకు పల్లె వెలుగు బస్సు రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. బుడ్డారెడ్డిపల్లి. శివనంపల్లి.గ్రామాలకు బస్సులు లేకపోవడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర నడిచి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండడంతో సమయం వృధా అవుతుందని రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. సురక్షిత ప్రయాణం కొరకు బస్సులు నడపాలని ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ గ్రామాలకు బస్సు వచ్చేలా చూడాలని ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.