ఎన్నికల విధులు నిర్వహించే ఆశా కార్యకర్తలకు పారితోషకాలు ఇవ్వాలి . సీఐటీయు
జోగులాంబ గద్వాల 6 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల ప్రస్తుతం జరుగుతున్న పురపాలక ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు పారితోషకాల ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేస్తూ, శుక్రవారం జిల్లా కేంద్రంలోని DMHO కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్ అసగర్ అలీ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలికల ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు పారితోషకాలు ఇవ్వకుండా పనులు చేయించుకోవడం సరి కాదన్నారు.జాబ్ చార్ట్ లో లేని పనులను చేయిస్తున్నప్పుడు, పారితోషకం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.ఎన్నికల్లో విధులు నిర్వహించే ఆశా కార్యకర్తలు పోలింగ్ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ రకాల ఆరోగ్య సేవలు అందిస్తున్నారని అన్నారు.విద్యా, ఎన్నికలు తదితర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆశా వర్కర్లను వినియోగించడమే కానీ వారికి విధులు నిర్వహించినందుకు గాను ఎటువంటి పారితోషకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.విధులు నిర్వహించడనికి వెళ్లిన సందర్బంగా ఆశా కార్యకర్తలకు కనీస వసతులు కల్పించడం లేదని,విధులు నిర్వహించడనికి అవసరం ఐన ఫర్నిచర్ అందుబాటులో ఉంచడం లేదని, చివరికి విధులు ముగించుకొని పస్తులతో ఉంటూ, ప్రయాణాలకు సైతం సొంత ఖర్చులతో ఇంటికి రావలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే పనికి తగ్గ వేతనాలు రాక, సక్రమంగా పారితోషాకాలు రాక అదనపు పని భారాలతో ఇబ్బందులు పడుతున్న ఆశాలకు పని చేయించుకుని పారితోషకాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న లేప్రసి సర్వే డబ్బులు ఇవ్వలేదని,నెల గడిచి ఆరు రోజులు అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది ఆశాలకు పారితోషకాలు వారి ఖాతాలలో జమ చేయలేదని అన్నారు.కావున ఎన్నికల విధులు నిర్వహించిన వారికి పారితోషకాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ సునీత ఆశా కార్యకర్తలు M.పద్మ, S శ్రీదేవి,నాగమ్మ, కవిత పాల్గొన్నారు.
ధన్యవాదాలతో
ఉప్పేర్ నరసింహ సీఐటీయు జిల్లా అధ్యక్షులు జోగులాంబ గద్వాల జిల్లా. తదితరులు ఉన్నారు.