అన్ని రకాల వైద్య సదుపాయాలతో ప్రభుత్వ వైద్య సేవలు:సూపర్డెంట్ నవీన్ క్రాంతి
జోగులాంబ గద్వాల 26 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆశ్రయించండి ,ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉండి వైద్యం అందిస్తామని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ నవీన్ క్రాంతి జిల్లా లోని ప్రజలకు పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ డాక్టర్ పై దౌర్జన్యం చేసి చేయి చేసుకున్నారని జిల్లాలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్లను మూడు రోజులు బందుకు పిలుపునిచ్చిన ప్రైవేట్ డాక్టర్ల అసోసియేషన్. పట్టణంలోని ప్రైవేటు దవాఖానాలో ఎలాంటి కేసులు వచ్చినా వైద్యం ట్రీట్మెంట్ చేయకూడదని ప్రైవేట్ నర్సింగ్ డాక్టర్స్ అన్నారు. కానీ పట్టణ ప్రజలు ఎలాంటి అధైర్య పడకుండా వివిధ రకాల పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల రోగులకు అన్ని పరీక్షలు జరిపి మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నామని ఆసుపత్రి సూపర్డెంట్ నవీన్ క్రాంతి మీడియా ముఖంగా తెలియజేశారు. 24 గంటలు అందుబాటులో డాక్టర్స్, నర్సులు రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ చేస్తామని ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని అన్నారు. పట్టణంలో మూడు రోజులు ప్రభుత్వ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ బంద్ సందర్భంగా ఈరోజు ఔట్ పేషెంట్లు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారని, అందరికీ అందుబాటులో ఉండి వైద్యం అందిస్తున్నామని అన్నారు. ఎవరు కూడా అధైర్య పడకుండా ఎనీ టైం ప్రభుత్వ ఆసుపత్రి ఆశ్రయించవచ్చని ధైర్యం చెప్పారు. డాక్టర్స్ అందుబాటులో ఉంటామని అన్నారు.