అనాధలైన చిన్నారులు
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో ఘటన...
చిన్నప్పుడే నాన్న వదిలి ఎటో వెళ్ళిపోయాడు, ఇక అమ్మ కృష్ణవేణీ శాంతినగర్ పట్టణ కేంద్రంలో ఉన్న ఆస్తి కాపాడుకోవటం కోసం అప్పు చేసి శెట్టర్లు నిర్మించింది తీసుకున్న అప్పుకు 10 రూపాయల వడ్డీ కట్టలేక వడ్డీ వ్యాపారుల బాధ భరించలేక ఏడు నెలల కిందట చనిపోయింది...
అమ్మ, నాన్న ఇద్దరు లేకపోవడంతో అమ్మమ్మ జయమ్మ అండగా ఉండి అన్ని తానై చిన్నారులను చూసుకునేది
ఇప్పుడు అమ్మమ్మ కూడా చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు అనాదాలయ్యారు...
అప్పు ఇచ్చిన వాళ్ళు కొందరి నాయకుల అండదండలతో ఇప్పుడు చిన్నారుల ఆస్తిపై కన్ను పడింది...
ఆస్తిని కాపాడి చిన్నారులను ఆదుకోవాలని శాంతి నగర్ వాసులు,స్థానిక ప్రజలు అధికారులను, నాయకులను వేడుకుంటున్నారు....