అనాధ పిల్లలకు అండగా శివకుమార్

తుంగతుర్తి 17 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి మండల కేంద్రంలో గత నెల 30న మరణించిన తడకమళ్ళ. పెద వెంకన్న–రాములమ్మ గార్లు మరణించి అనాధలైన పిల్లల విషయం సోషల్ మీడియాలో చూసి చలించిపోయి తల్లిదండ్రులు కోల్పోయిన కుటుంబ అనాధ పిల్లలకి చేయూతను అందించడం కోసం ఎర్కచర్ల శివకుమార్ తుంగతుర్తి కి వచ్చి వారికి ఆర్థిక సాహయం పదివేల రూపాయలు అందించడం జరిగింది. పెద్ద కూతురు తడకమల్ల ఉమకి జిఎన్ఎమ్ చేయడం కోసం కాలేజీలో మాట్లాడుతానని హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి వారి దత్తత తీసుకోవాలని శివ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో ఖాందాన్ మీడియా సతీష్ మందుల, రాజు, గోపి, కార్తీక్ ,కొండగడుపుల నవీన్, మరికంటి.అశోక్, బొంకురి జలంధర్, బొంకూరి రమేష్, మల్లెపాక సురేష్, తడకమల్ల నరేష్, బొంకూరి రవి, కాసర్ల రాజశేఖర్, బొజ్జ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.