అధికారుల అనుమతి లేకుండా యదేచ్ఛగా మట్టి తరలింపు

Feb 26, 2026 - 19:23
 0  2
అధికారుల అనుమతి లేకుండా యదేచ్ఛగా మట్టి తరలింపు
అధికారుల అనుమతి లేకుండా యదేచ్ఛగా మట్టి తరలింపు

 జోగులాంబ గద్వాల 26 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి మండలంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా యదేచ్చగా మట్టి తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఎర్రవల్లిలోని ఒక వెంచర్కు తిమ్మాపురం నుండి వారం రోజుల నుండి మట్టిని తరలిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఈ విషయమై తాసిల్దార్ నరేష్ ను వివరణ కోరగా తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆయన వివరించారు. పట్ట పగలు యదేచ్చగా మట్టి తరలింపు పై అధికారుల తీరు పట్ల ప్రజలు విస్మయం చెందుతున్నారు. సమాచారం తెలిసినా కూడా మట్టి తరలింపును ఆపకుండా అధికారులు తాత్సారం చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ మట్టి తరలింపులు నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333