ప్రజలకు అన్ని వైద్య సేవలు అందించాలి:జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సిద్దప్ప
జోగులాంబ గద్వాల 27 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి. గద్వాల్:- జిల్లా జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డిఎంహెచ్ఓ సిద్ధప్ప ఆధ్వర్యంలో మంగళవారం వివిధ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు పనిచేసే సిబ్బంది అందరికీ జిల్లా లెవెల్ ఓరియంటేషన్, కాంప్రహెన్సీవ్ ప్రైమరీ హెల్త్ కేర్, మరియు హెచ్ఐవి ఎయిడ్స్, దిశా ప్రోగ్రాం పై సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ సిద్దప్ప మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఇట్టి ప్రోగ్రామ్లపై అవగాహన కలిగి ఉండాలని, హెచ్ఐవి ఎయిడ్స్ నందు, అన్ని విషయాలు తెలుసుకుని, ప్రజలకు వైద్య సేవలు అందించాలని అయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ సంధ్యా కిరణమైయి, డిపిఎం మాధవి, డిడియం రామాంజనేయులు,కళ్యాణి, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్, బిఏఎంఎస్ డాక్టర్లు, మరియు ఎయిడ్స్ దిశా ప్రోగ్రాం నకు సంబంధించిన సిబ్బంది రాఘవేంద్ర రెడ్డి సి ఎస్ ఓ, రమేష్ సిపిఎం, సాయికుమార్ డిఎండిఓ పాల్గొన్నారు.