బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కుంజా ధర్మా, పొడియం బాలరాజు నియామకం

Mar 31, 2026 - 19:50
 0  0
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కుంజా ధర్మా, పొడియం బాలరాజు నియామకం
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కుంజా ధర్మా, పొడియం బాలరాజు నియామకం

తెలంగాణ వార్త మార్చి 31 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గాన్ని బలోపేతం చేసే క్రమంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కుంజా ధర్మా, పొడియం బాలరాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా వారు స్పందిస్తూ, తమపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారికి, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి మరియు జిల్లా నాయకులకు, పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. పార్టీ విస్తరణలో భాగంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కృషి చేస్తూ, బీజేపీ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు.
ఎండ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333