శిథిలా వ్యవస్థ కు చేరుకున్న ప్రభుత్వ పాఠశాల
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన దగడపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల.
శిథిలా వ్యవస్థకు చేరిన,పెచ్చులు ఊడిన, పెంకులు రాలిన ఉపాధ్యాయులు విద్యార్థులు అలాంటి పాఠశాలల్లోనే విద్యను అభ్యసించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
09-09-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:- చిన్నంబావి మండలం లోని దగడపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ శిథిలావస్థకు చేరడం జరిగింది. ఈ యొక్క పాఠశాలలో 120 మంది విద్యార్థులు విద్యను అభ్యశిస్తున్నారు. ఈ గదులలో విద్యను బోధించడానికి భయపడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎప్పుడు పెచ్చులు ఊడి మీద పడతాయో అని భయపడుతున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు చెట్ల కిందనే విద్యను అందించడం జరుగుతుంది.వర్షం పడినప్పుడు భయపడుతూ కాలం గడుపుతున్న విద్యార్థులు, ఎస్ వి కే స్వచ్ఛంద సంస్థ వారు 10 లక్షల విలువ చేసే సైన్స్ పరికరాలు అందించినప్పటికీ వాటిని విద్యార్థుల కు సరిగా వినియోగించ లేకపోతున్నామని తమా బాధను వెలిబుచ్చిన ఉపాధ్యాయులు, కొత్త బిల్లింగ్ శాన్షన్ అయి మూడు సంవత్సరాలు అయినప్పటికీ 4 రూములు చెత్తు వేసి వదిలి వేయడం జరిగింది. మిగిలిన 4 రూములు బేస్మెంట్ పిల్లర్ల వరకు పరిమితమయ్యాయి గత నాలుగు నెలల నుంచి ఎలాంటి పనులు జరగడం లేదు, విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించి పాఠశాల నిర్మాణం త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.