అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకై స్థలం కేటాయించాలి

May 27, 2026 - 20:44
 0  1
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకై స్థలం కేటాయించాలి

రోడ్డు వెడల్పులో తొలగిస్తున్న అంబేద్కర్ విగ్రహం..

నూతన స్థలం కేటాయించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం

​ తిరుమలగిరి 28 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

వలిగొండ - తొర్రూర్ ప్రధాన రహదారి వెడల్పు పనుల కారణంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించాల్సి వస్తుందని . ఈ నేపథ్యంలో, నూతనంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తగిన స్థలాన్ని కేటాయించాలంటూ తిరుమలగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్‌కు తొండ గ్రామ అంబేద్కర్ యూత్ సభ్యులు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ హరిప్రసాద్ సానుకూలంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం అందించడం జరిగిందని తెలిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, త్వరలోనే విగ్రహ ఏర్పాటుకు తగిన స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తొండ గ్రామ అంబేద్కర్ యూత్ సభ్యులు యాకయ్య, వినోద్ రావు, రామ్ కుమార్, మనోహర్, యాదగిరి, సురేష్, రాజారావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి