అ గ్రామంలో భారీ మొసలి కలకలం
గద్వాల:-ధరూర్ మండలం గూడెందొడ్డి గ్రామంలో భారీ మొసలి కలకలం రేపింది. గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూల్ వద్ద మొసలి ప్రత్యక్షమవడం తో గ్రామస్తులు భయాందోళనకు గురి అయ్యారు.ఫారెస్ట్ అధికారులు మొసలిని పట్టుకుని జూరాల ప్రాజెక్టు లో వదిలారు. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా గూడెందొడ్డిలో నిర్మించిన రిజర్వాయర్ నుంచి భారీ మొసలి గ్రామంలోకి ప్రవేశించిందన్నారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూల్ వద్ద మొసలి కనిపించడంతో గమనించిన గ్రామస్థులు అటవిశాఖ, పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది గ్రామస్థులు సహాయంతో మొసలిని పట్టుకుని, జూరాల ప్రాజెక్టులో వదిలేశారు. ఎక్కడైనా మొసలి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, తాము వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి పర్వేజ్ అహ్మద్ సూచించారు. మొసలి బరువు సుమారు 1.5క్వింటాళ్ల ఉంటుందని అన్నారు.