SIR ఫేజ్ -2 BLA & సూపర్ వైజర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
అలంపూర్ నియోజక వర్గ BLA ల సమావేశం
శాంతి నగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు
జోగులాంబ గద్వాల 20 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని SIR పై పెట్టిన ప్రత్యేక శ్రద్ధ కి అనుకూలంగా గత నెల రోజులుగా ప్రతి బూత్ లో BLA లు కీలకంగా పని చేస్తున్నందుకు గాను వారిని అభినందిస్తూ .యిదే క్రమంలో SIR మొదటి విడత అనంతరం జరిగే చేయాల్సిన కార్యక్రమాలు రెండవ ఫేజ్ లో నింపాల్సిన ఫారం లు, పాటించాల్సిన నిబంధనలు గురించి అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లబ్ధిదారులను కాంగ్రెస్ పార్టీ తో అనుసంధానం అయి ఉండేలా చూడటం,పేదవారికి అర్హులకు సంక్షేమ పథకాలను అందేలా చూడాలని అన్నారు .
కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓటర్లను గుర్తించి వారి ఓటును కాపాడాల్సిన బాధ్యత BLA ల పైన ఉందంటూ తెలియజేశారు .ఈ కార్యక్రమానికి అలంపూర్ నియోజక వర్గ ఇంచార్జి గా జాతీయ కిసాన్ సెల్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ దులిపూడి నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి సిద్దేశ్వర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజక వర్గంలోని అందరూ బూత్ లెవెల్ ఏజెంట్లు,ఇంచార్జి లు మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.