PHC మెడికల్ ఆఫీసర్లకు, Phc సూపర్‌వైజర్లతో జిల్లా నెలవారీ రివ్యూ మరియు Ncd రివ్యూ
పాల్గొన్న జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు*మరియు *జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది
••. జిల్లా నందు 4వ రౌండ్ Ncd స్క్రీనింగ్ నందు వెనుకబడిన PHCల ANMలు రోజూ 4 మంది చొప్పున జిల్లాకు వచ్చి స్క్రీనింగ్ చేయాలి : PO డాక్టర్ రామచంద్రరావు
జోగులాంబ గద్వాల 3 జూలై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జె. సంధ్యాకిరణ్మయి*మేడం సమక్షంలో అన్ని *ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు PHC సూపర్‌వైజర్లు, NCD సూపర్‌వైజర్లతో నెలవారీ NCD ప్రోగ్రాం రివ్యూ మీటింగ్ నిర్వహించారు .
•• NCD ప్రోగ్రాం ఆఫీసర్ డా. రామచంద్రరావు జిల్లాలోని అన్ని PHCల వారీగా NCD విభాగాల టార్గెట్లు, అచీవ్‌మెంట్లు, వెనుకబడిన PHCలు, సబ్ సెంటర్ల వివరాలను సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
•• సమీక్షలో చర్చించిన హెల్త్ ప్రోగ్రాంలు & ముఖ్యాంశాలు:
*NCD విభాగం కార్యక్రమ వివరాలు ప్రస్తుత స్థితి & ఆదేశాలు
*1. NPCDCS* 30+ ఏళ్లు దాటిన వారికి BP, షుగర్, నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ "4వ రౌండ్ NCD స్క్రీనింగ్ పూర్తయినా కొన్ని PHCలలో BP, షుగర్ కేసుల గుర్తింపు చాలా తక్కువగా ఉంది. టార్గెట్‌కు తగ్గట్లు కేసులు చూపించడం లేదు."
*2. NPHCE* 60+ వృద్ధులకు వారానికి ఒకరోజు Geriatric Clinic, ఇంటి వద్ద సేవలు "ప్రతి PHCలో ఎల్డర్లీ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. బెడ్ రిడెన్ రోగులను 100% కవర్ చేయాలి."
*3. NMHP* మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్, టెలి-మానస్ 14416, ఆత్మహత్యల నివారణ "అన్ని PHCలలో మానసిక మందులు అందుబాటులో ఉంచాలి. ASHAలు హై రిస్క్ వ్యక్తులను గుర్తించాలి."
*4. NPPC* పాలియేటివ్ కేర్ - క్యాన్సర్, పక్షవాతం రోగులకు ఇంటి వద్ద నొప్పి నివారణ "లైన్ లిస్ట్ ప్రకారం నెలకు 2 సార్లు విజిట్ తప్పనిసరి. మార్ఫిన్ స్టాక్ రిజిస్టర్ అప్‌డేట్ చేయాలి."
*5. NOHP* నోటి ఆరోగ్యం, పొగాకు నియంత్రణ, నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ "RBSK టీంతో కలిసి స్కూళ్లలో స్క్రీనింగ్ పూర్తి చేయాలి. పొగాకు వాడే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి."
పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్న PHCలపై కీలక ఆదేశం:
"4వ రౌండ్ NCD స్క్రీనింగ్‌లో BP, షుగర్ కేసులు ఆశించిన స్థాయిలో గుర్తించని PHCలు, సబ్ సెంటర్ల ANMలు ప్రతిరోజూ నలుగురు చొప్పున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వచ్చి ఇక్కడే స్క్రీనింగ్ నిర్వహించి వెళ్లాలి. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి, మీ పరిధిలో ఎలా కేసులు గుర్తించాలో నేర్పిస్తాం. టార్గెట్ రీచ్ అయ్యేవరకు ఇది కొనసాగుతుంది" అని PO డా. రామచంద్రరావు గారు స్పష్టం చేశారు.
DM&HO డా. జె. సంధ్యా కిరణ్మయి మాట్లాడుతూ "NCD పోర్టల్ డేటా, ఫీల్డ్ రియాలిటీకి పొంతన ఉండాలి. స్క్రీనింగ్ చేసిన ప్రతి ఒక్కరి వివరాలు అదే రోజు అప్‌లోడ్ చేయాలి. వెనుకబడిన PHCల MO, సూపర్‌వైజర్లు పూర్తి బాధ్యత వహించాలి. జూన్ నెలలో జిల్లా 100% టార్గెట్ అచీవ్ చేయాలి" అని ఆదేశించారు.
•••ఈ సమావేశంలో అన్ని జాతీయ ప్రోగ్రాంల అధికారులు, హెల్త్ స్టాఫ్, NCD కోఆర్డినేటర్ శ్యాంసుందర్, DDM రామాంజనేయులు, జిల్లా వైద్య సిబ్బంది పాల్గొన్నారు.