సీజనల్ & కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష
PHC మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లకు DM&HO కీలక ఆదేశాలు
జోగులాంబ గద్వాల 3జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (NVBDCP) మరియు సీజనల్ వ్యాధుల అవగాహన కార్యక్రమం*పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల *మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్‌వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
••• జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జె. సంధ్యాకిరణ్మయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డా. రామచంద్రరావు, డా. జి. రాజు డాక్టర్ ప్రసూనా రాణి,మరియు జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
••• DM&HO డా. జె. సంధ్యాకిరణ్మయి మేడం ఆదేశాలు:
1. డెంగ్యూ, మలేరియా నివారణ: "ప్రతి PHC పరిధిలో ఇంటింటి జ్వర సర్వేను వెంటనే ప్రారంభించాలి. లార్వా సర్వేలో ASHA, ANMలు కలిసి పనిచేయాలి. పాజిటివ్ కేసులు వస్తే ఆ ఇంటి చుట్టూ 50 ఇండ్లలో ఫీవర్ సర్వే, సోర్స్ రిడక్షన్, యాంటీ లార్వా స్ప్రే, ఫాగింగ్ తప్పనిసరి."
2. వైద్య సేవలు: "అన్ని PHCలలో ఫీవర్ కార్నర్ 24x7 పనిచేయాలి. NS1, IgM కిట్లు, మలేరియా RDT కిట్లు స్టాక్ ఉంచుకోవాలి. ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉన్న కేసులను వెంటనే జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయాలి."
3. అవగాహన: "ప్రతి శుక్రవారం 'డ్రై డే' కార్యక్రమం ఖచ్చితంగా నిర్వహించాలి. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో వర్షాకాల వ్యాధులపై అవగాహన కల్పించాలి. ఫ్రైడే-డ్రైడే, అందరూ తప్పకుండా చేయాలని తెలిపారు
4. డయేరియా నియంత్రణ: "వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల వచ్చే డయేరియా కేసులు పెరగకుండా ప్రతి గ్రామంలో క్లోరినేషన్ 100% పూర్తి చేయాలి. ORS ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు అన్ని ఆశా వర్కర్ల దగ్గర ఉండాలి."
డా. జి. రాజు మాట్లాడుతూ "మలేరియా నిర్మూలనలో భాగంగా అన్ని నిర్మాణ సైట్లు, ఇటుక బట్టీల వద్ద ప్రత్యేక సర్వే చేయాలి. వలస కార్మికులకు స్క్రీనింగ్ టెస్టులు తప్పనిసరి" అని తెలిపారు.
"జ్వరం వస్తే నిర్లక్ష్యం వద్దు, వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేయించుకోవాలి. ప్రైవేట్‌లో అనవసర యాంటీబయాటిక్స్ వాడవద్దు" అని ప్రజలకు DM&HO విజ్ఞప్తి చేశారు.