విద్యాసంస్థలుగా గురుకుల కేంద్రాలు నిలవాలి
జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు.
జోగులాంబ గద్వాల 3 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : జిల్లాలోని గురుకుల విద్యా సంస్థలు విద్యా కేంద్రాలుగా నిలవాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శుక్రవారం కే టి దొడ్డి మండలంలో మహాత్మ జ్యోతిరావు పూలే. తెలంగాణ బీసీ సంక్షేమ. గురుకులం బాలురు పాఠశాల. జూనియర్ కళాశాల బాలురును ఆయన అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యా వసతి భోజన సౌకర్యాలు శుద్ధత తదితర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గురుకుల విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని వారి కోరారు. ప్రతి విద్యార్థికి నాణ్యతమైన విద్యతోపాటు రక్షితమైన పరిశుభ్రతమైన ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒకరి బాధ్యత అని వారు గుర్తు చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పోషకాహారంతో కూడిన భోజనం వడ్డించాలని తెలిపారు. పరిశుభ్రతను ఎల్లప్పుడూ పాటించాలని త్రాగునీరు సౌకర్యాలు మరుగుదొడ్లు మూత్రశాలలు నిర్వహణ. పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు విద్యా ప్రగతి పై ప్రత్యేక దృష్టి సారిస్తూ. ప్రతి విద్యార్థికి ప్రతిభను వెలికి తేలా బోధన చేయాలని సూచించారు. క్రమశిక్షణ వ్యక్తిత్వం వికాసం క్రీడలు సహపాట్యా హాజరు శాతం తదితర వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి. ప్రభుత్వ కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో వారికి చేరేలా అధికారులు పనిచేయాలని వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లు అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.