MCH సెంటర్ నందు కొనసాగుతున్న HPV వ్యాక్సిన్

మెడికల్ ఆఫీసర్  డాక్టర్ ప్రియాంక.

Apr 11, 2026 - 19:16
Apr 11, 2026 - 19:17
 0  3
MCH సెంటర్ నందు కొనసాగుతున్న HPV వ్యాక్సిన్

జోగులాంబ గద్వాల 11 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రతి రోజు ఇట్టి వాక్సిన్ CHC, Dist హాస్పిటల్స్, PHC, లలో అందుబాటులో ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా  డిఎంహెచ్వో డాక్టర్ సంద్యా కిరణ్మయి కి ఆదేశాల మేరకు, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప  ఆధ్వర్యంలో.. ప్రతి రోజు ఎంసీహెచ్ సెంటర్ నందు HPV వ్యాక్సిన్ వేస్తున్నారని ఇట్టి అవకాశాన్ని  14 సంవత్సరాలు పూర్తయి 15 సంవత్సరంలో ఉన్నా బాల బాలికలందరు ఉపయోగించుకోవాలని, వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తల్లిదండ్రులతో కన్సల్ట్ ఫామ్ తీసుకొని రావాల్సిందిగా మెడికల్ ఆఫీసర్ ప్రియాంక  తెలిపారు.  ఇట్టి కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ శ్యామ్సుందర్, ఎం సి హెచ్ సూపర్వైజర్ సుబ్బలక్ష్మి, Anms, గ్రేస్, లక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State