CEIR ద్వారా రికవరీ చేసిన 38 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేసిన
జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్
జోగులాంబ గద్వాల 20 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతిని.ధి:- ప్రజలు తమ మొబైల్ దొంగళించబడిన లేదా మిస్సింగ్ అయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లో కానీ ఫిర్యాదు చేస్తే పోలీస్ లు సాంకేతికతను ఉపయోగించి వాటిని చేదించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు ఐపీఎస్ . తెలిపారు.
ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని గ్రెవెన్స్ హల్ నందు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 38 మంది బాధితుల మొబైల్ ఫోన్లను ఆయా స్టేషన్ లలో CEIR పోర్టల్ విధులు నిర్వహించే సిబ్బంది ఈ రోజు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా బాధితులకు అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ దొంగలించబడిన, మిస్సింగ్ అయిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అలాగే జాగ్రత్తగా ఉంచుకోవడం లో నిర్లక్ష్యము చేయకూడని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా CEIR పోర్టల్ లో పిర్యాదు చెయ్యాలని అన్నారు.మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని నేరస్తులు దొంగలించిన మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉంటూ వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. మొత్తం 38 ఫోన్ లను నూతన టెక్నాలజీ ఐటి కోర్ నుండి ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగిందనీ , అందుకు కృషి చేసిన ఐటి కోర్ ఎస్సై రజిత , అన్ని పోలీస్ స్టేషన్ లలో CEIR పోర్టల్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అధికారులను ఎస్పీ అభినందించారు. ఈ సందర్బంగా మొబైల్స్ అందుకున్న బాధితులు జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డి .ఎస్పి శ్రీ వై.మొగిలయ్య, గద్వాల్,ఆలంపూర్, శాంతి నగర్ సిఐ లు టి . శ్రీను, రవి బాబు, టాటా బాబు, ఐటీ సెల్ ఇంచార్జి ఎస్సై రజిత తదితరులు పాల్గొన్నారు.