99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక
*99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక,* -
మండల వ్యాప్తంగా సర్పంచులకు సర్పంచులకు శిక్షణ.
తెలంగాణ వార్త (నుగూరు)వెంకటాపురం, మార్చి 14: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మండల ప్రజా ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం వెంకటాపురం మండలంలోని సర్పంచులకు 99 డేస్ ప్రజా పాలన ,ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి 24 శాఖల మండల స్థాయి అధికారులు హాజరై ప్రభుత్వ ప్రధాన పథకాల గురించి వివరించారు.తదుపరి 90 రోజులలో తమ తమ శాఖల ద్వారా అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికలు, కార్యక్రమాలను వారు వివరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు చురుకుగా పాల్గొని, తమ తమ గ్రామాల సమస్యలు, అవసరాలను వెల్లడించారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.